PAK vs SL : పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్‌.. భారీ జ‌రిమానా..

రావల్పిండి వేదికగా శ్రీలంతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో గెలిచి మంచి జోష్‌లో ఉన్న పాకిస్తాన్ జ‌ట్టుకు (PAK vs SL) ఐసీసీ షాకిచ్చింది.

PAK vs SL : పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్‌.. భారీ జ‌రిమానా..

Pakistan handed hefty fine over slow over rate in first ODI against Sri Lanka

Updated On : November 14, 2025 / 10:29 AM IST

PAK vs SL : రావల్పిండి వేదికగా శ్రీలంతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో గెలిచి మంచి జోష్‌లో ఉన్న పాకిస్తాన్ జ‌ట్టుకు ఐసీసీ షాకిచ్చింది. పాక్ జ‌ట్టులోని ప్ర‌తి ఆట‌గాడి మ్యాచ్ ఫీజులో 20 శాతం జ‌రిమానాగా విధించింది. తొలి వ‌న్డేలో పాక్ జ‌ట్టు స్లో ఓవ‌ర్ రేటును న‌మోదు చేయ‌డమే ఇందుకు కార‌ణం.

న‌వంబ‌ర్ 11న రావ‌ల్సిండి వేదిక‌గా శ్రీలంక, పాక్ జ‌ట్లు త‌ల‌పడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్ జ‌ట్టు నిర్ణీత స‌మ‌యంలో త‌మ ఓవ‌ర్ల కోటాను పూర్తి చేయ‌లేక‌పోయింది. నాలుగు ఓవ‌ర్లను త‌క్కువ‌గా వేసింది. దీంతో ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక్కొ ఓవ‌ర్‌కు 5 శాతం చొప్పున నాలుగు ఓవ‌ర్ల‌కు మొత్తం 20 శాతం జ‌రిమానాగా విధించింది.

Ravindra Jadeja : కెప్టెన్సీ ఇస్తేనే వ‌స్తా.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ర‌వీంద్ర జ‌డేజా కండీష‌న్‌..!

‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. జ‌ట్టు త‌మ నిర్ణీత స‌మ‌యంలో ఓవ‌ర్ల కోటా పూర్తి చేయ‌కుంటే.. ఎన్ని త‌క్కువ ఓవ‌ర్లు వేసి ఉంటే.. ప్ర‌తి ఓవ‌ర్‌కు ఐదు శాతం చొప్పున జ‌రిమానా విధించ‌బ‌డుతుంది. ఈ లెక్క‌న పాక్ జ‌ట్టు నాలుగు ఓవ‌ర్ల‌ను త‌క్కువ‌గా వేయ‌డంతో 20 శాతం జ‌రిమానాగా విధించ‌బ‌డింది.  పాక్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది చేసిన త‌ప్పిదాన్ని, విధించిన శిక్ష‌ను అంగీక‌రించాడు. దీనిపై త‌దుప‌రి ఎలాంటి విచార‌ణ ఉండ‌దు.’ అని ఐసీసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

రెండో వ‌న్డే నేడే..

రావ‌ల్సిండి వేదిక‌గా పాక్‌, శ్రీలంక జ‌ట్లు నేడు (న‌వంబ‌ర్ 14 శుక్ర‌వారం) రెండో వ‌న్డే మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. వాస్త‌వానికి ఈ మ్యాచ్‌ గురువారం జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. ఇస్లామాబాద్‌లో బాంబు పేలుడు కార‌ణంగా దాదాపు 8 లంక ఆట‌గాళ్లు స్వ‌దేశానికి వెళ్లిపోతామ‌ని తెలిపారు. దీనిపై లంక బోర్డుతో పీసీబీ చ‌ర్చ‌లు జ‌రిపింది.

Shubman Gill : ష‌మీ రీ ఎంట్రీపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. అతడి లాంటి తోపు బౌల‌ర్లు లేరు గానీ..

ఆ త‌రువాత పాక్‌తో వ‌న్డే సిరీస్‌తో పాటు ముక్కోణ‌పు సిరీస్ పూర్తి అయ్యాకే.. పాక్‌ను వీడి రావాల‌ని లంక బోర్డు ప్లేయ‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలోనే రెండో, మూడో వ‌న్డే మ్యాచ్‌ల‌ను ఒక రోజు వెన‌క్కి జ‌రిపారు.