Shubman Gill : ష‌మీ రీ ఎంట్రీపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. అతడి లాంటి తోపు బౌల‌ర్లు లేరు గానీ..

టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill) భార‌త వెట‌ర‌న్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

Shubman Gill : ష‌మీ రీ ఎంట్రీపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. అతడి లాంటి తోపు బౌల‌ర్లు లేరు గానీ..

Shubman Gill Gives kay comments On Mohammed Shami ahead of South Africa Tests

Updated On : November 13, 2025 / 3:59 PM IST

Shubman Gill : భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య శుక్ర‌వారం నుంచి కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ మీడియాతో మాట్లాడాడు. ఈ క్ర‌మంలో భార‌త వెట‌ర‌న్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మైన షమీ పున‌రాగ‌మ‌నం చేయ‌లేక‌పోతున్నాడు. దేశ‌వాళీ క్రికెట్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తున‌ప్ప‌టికి కూడా అత‌డిని సెల‌క్ట‌ర్లు ఎంపిక చేయ‌డం లేదు. ఈ క్ర‌మంలో ష‌మీ పున‌రాగ‌మ‌నం పై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. షమీ లాంటి బౌల‌ర్లు చాలా అరుద‌ని చెప్పుకొచ్చాడు. అదే స‌మ‌యంలో ఆకాశ్ దీప్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్ వంటి బౌల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌ను విస్మ‌రించ‌లేమ‌న్నాడు. త‌దుప‌రి టెస్టు సిరీస్‌పైనా తాము ఓ క‌న్నేసి ఉంచామ‌ని, ష‌మీ ఎంపిక విష‌యం అనేది సెల‌క్ట‌ర్ల‌కే ఎక్కువ తెలుసున‌ని చెప్పుకొచ్చాడు.

KKR : ఐపీఎల్‌ 2026కి ముందు కేకేఆర్ కీల‌క నిర్ణ‌యం.. అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్స‌న్‌..

ఇక స‌ఫారీల‌తో జ‌ర‌గ‌నున్న తొలి టెస్టు పై మాట్లాడుతూ.. వారిని ఎదుర్కొన‌డం అంత తేలికైన విష‌యం కాద‌న్నాడు. ద‌క్షిణాఫ్రికా చాలా మంచి జ‌ట్టు. వారు ఛాంపియ‌న్స్‌. అయిన‌ప్ప‌టికి క్లిష్ట‌ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు ఎలా ఎదుర్కొవాలో మాకు తెలుసున‌ని గిల్ అన్నాడు.

డ‌బ్ల్యూటీసీ 2025-27 ఫైన‌ల్ మ్యాచ్‌కు అర్హ‌త సాధించాలంటే ద‌క్షిణాఫ్రికాతో జ‌ర‌గ‌నున్న రెండు టెస్టు మ్యాచ్‌లు ఎంతో కీల‌కం అని అన్నాడు. ఈ మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతామ‌న్నాడు. ఇక తొలి టెస్టుకు ఆతిథ్యం ఇవ్వ‌నున్న ఈడెన్ పిచ్ పై స్పందిస్తే ఇదొక టిపిక‌ల్ ఇండియ‌న్ పిచ్ అని తెలిపాడు.