IND Vs SA: మీడియాలో కోహ్లీ కెప్టెన్సీ రచ్చ.. ఫన్ మోడ్‌లో ద్రవిడ్ – విరాట్‌లు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై మీడియాలో రచ్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా.. ఇవేమీ పట్టనట్లే ఉంది.

Ind Vs Sa

IND Vs SA: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై మీడియాలో రచ్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా.. ఇవేమీ పట్టనట్లే ఉంది. చివరికి హెడ్ కోచ్ ద్రవిడ్, విరాట్ కోహ్లీలు సైతం ఫన్ మోడ్ లో కనిపిస్తూ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది.

టీం అంతా కలిసి రెండు జట్లుగా ఉండి వాలీబాల్ ఆడుతూ కనిపించారు. కోహ్లీ ఒక వైపు, ద్రవిడ్ ఒక వైపు జట్లలో ఉండటం పాయింట్ల కోసం ప్రయత్నిస్తుండటం, ద్రవిడ్ తలతో బాల్ ను హిట్ చేయడం వీడియోలో కనిపిస్తున్నాయి.

‘చాలా రోజుల క్వారంటైన్ తర్వాత టీమిండియా ప్రాక్టీస్ సెషన్ కు వచ్చింది. ప్లేయర్లు కంఫర్టబుల్ గా పీల్ అవ్వాలని లో రిస్క్ ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేశాం. ఇలాంటి గేమ్స్ తో స్ట్రెచింగ్, రన్నింగ్ మాత్రమే జరుగుతుంది. పైగా వాలీబాల్ ను ఆడేసమయంలో ప్లేయర్లంతా బాగా ఎంజాయ్ చేశారు’ అని సోహం దేశాయ్ వెల్లడించారు.

………………………… : బికినీతో వలలో చిక్కుకున్న లైగర్ హీరోయిన్

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియాల మధ్య టెస్టు సిరీస్ ఆరంభ మ్యాచ్ జరగనుంది. రెండో మ్యాచ్ 2022 జనవరి 3 నుంచి జనవరి 7వరకూ మూడో మ్యాచ్ జనవరి 11నుంచి జనవరి 15వరకూ కేప్ టౌన్ వేదికగా జరగనున్నాయి. ఐసీసీ వరల్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఈ టెస్టు సిరీస్ జరుగుతుంది.