Ind Vs SA : కష్టాల్లో సౌతాఫ్రికా.. 104 పరుగులకే 5 వికెట్లు డౌన్

సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు రెండో సెషన్‌ ముగిసే సరికి దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది.

Ind Vs Sa Test Match

Ind Vs SA : సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో మూడు రోజు రెండో సెషన్‌(టీ బ్రేక్) ముగిసే సరికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. టెంబా బవుమా (31), వియాన్‌ ముల్డర్‌ (4) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మహమ్మద్‌ షమీ 2 వికెట్లు తీశాడు. మహమ్మద్‌ సిరాజ్‌, జస్ ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్‌ చెరో వికెట్ పడగొట్టారు. దక్షిణాఫ్రికా ఇంకా 218 పరుగులు వెనుకబడి ఉంది.

New E-cycles from Hero: దేశంలోనే మొట్టమొదటిసారిగా బ్లూటూత్ తో వచ్చిన సైకిల్

సెంచూరియన్ టెస్టులో రెండో రోజు ఆట వర్షం కారణంగా రద్దు కాగా, మూడో రోజు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆట షురూ అయింది. ఓవర్ నైట్ స్కోరు 272-3 తో ఆట కొనసాగించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 327 పరుగులకు ఆలౌట్ అయింది. 55 పరుగులకే మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది.

Oppo A11s : భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్..!

కేఎల్ రాహుల్ 123 పరుగులు చేయగా, అజింక్యా రహానే 48 పరుగులకు ఔటయ్యాడు. టీమిండియా లోయర్ ఆర్డర్ ప్రభావం చూపలేకపోయింది. సఫారీ పేసర్ లుంగీ ఎంగిడి చెలరేగాడు. 6 వికెట్లు పడగొట్టాడు. రబాడ 3 వికెట్లు తీశాడు. మార్కో జాన్సెన్ కు ఒక వికెట్ దక్కింది.

బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టుకు తొలి ఓవర్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. బుమ్రా బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ (1) పంత్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత పీటర్సన్‌ (15)తో కలిసి మార్‌క్రమ్ (13) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిని షమీ ఔట్‌ చేశాడు. వీరిద్దరూ క్లీన్‌బౌల్డ్‌ కావడం విశేషం. వాన్‌డెర్ డస్సెన్ (3) కూడా నిరాశపరిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా డికాక్‌ (34)తో కలిసి బవుమా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ జంట హాఫ్ సెంచరీ (72) భాగస్వామ్యం నిర్మించింది. వీరిద్దరూ కుదురుకున్న సమయంలో భారత బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ బ్రేక్‌ ఇచ్చాడు. డికాక్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.