Ind vs SL: లంకపై తొమ్మిదేళ్లుగా టీమిండియాదే విజయం

Ind vs SL: కెప్టెన్‌గా బాధ్యతలు అందుకుని సిరీస్‌లో తొలి మ్యాచ్ విజయాన్ని అందించాడు శిఖర్ ధావన్. శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 263 పరుగుల లక్ష్యాన్ని భారత్ 36.4 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాహుల్ ద్రవిడ్ సమక్షంలో జరిగిన ఈ ఫీట్.. తొమ్మిదేళ్లుగా కొనసాగుతూనే ఉంది.

2012 జులై 28నుంచి లంక గడ్డపై ఒక్క వన్డే కూడా ఓడిపోకుండా విజయాలను నమోదు చేసింది ఇండియా. లంక పర్యటనలో మరే పర్యాటక జట్టు నమోదు చేయనన్ని విజయాలను నమోదు చేసింది టీమిండియా. 2017లో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా లంకను వైట్ వాష్ చేసింది.

రెగ్యూలర్ ప్లేయర్స్ టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిపోయినప్పటికీ.. ఘన విజయాన్ని నమోదు చేశారు. ధావన్ కెప్టెన్సీలో యువ జట్టు హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, చాహల్ ఉన్నారు.

మొత్తం లంక పర్యటనకు వచ్చిన జట్టులన్నింటిలో ఇండియానే ఎక్కువ విజయాలు నమోదు చేసింది. మొత్తం ఎదుర్కొన్న 61 మ్యాచ్‌లలో 28 గెలిచి 27 ఓడిపోగా 6మ్యాచ్‌లలో విజయం తేల్చుకోలేకపోయారు.

ఈ విజయంతో ధావన్ జట్టు మరోసారి ఆతిథ్య జట్టుపై పై చేయి సాధిస్తుందనే నమ్మకం కలుగుతుంది. బృందంలో కలవాల్సి ఉన్న కొందరు ప్లేయర్లకు కొవిడ్ పాజిటివ్ రావడంతో మ్యాచ్ కు దూరమయ్యారు. ఇటీవలే ఇంగ్లాండ్ నుంచి అక్కడికి చేరుకున్న టీమిండియా కొవిడ్-19 ప్రొటోకాల్స్ పాటిస్తూ సిరీస్ పూర్తి చేయాలనుకుంటుంది.

ట్రెండింగ్ వార్తలు