Shreyas Iyer : నాతో పాటు అక్ష‌ర్ క‌ళ్లు ఎర్ర‌బ‌డ్డాయి.. ఇక ఈ రాత్రి.. తొలి టీ20లో విజ‌యం త‌రువాత శ్రేయ‌స్ అయ్య‌ర్ కామెంట్స్ వైర‌ల్..

వెస్టిండీస్ పై తొలి టీ20 మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం పై టీమ్ఇండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (Shreyas Iyer) స్పందించాడు.

IND vs WI 1st T20 Shreyas Iyer comments after Team India Beat West Indies

Shreyas Iyer : ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భార‌త్ శుభారంభం చేసింది. ల‌క్నో వేదిక‌గా మంగ‌ళ‌వారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భార‌త్ 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక తొలి టీ20 మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం ప‌ట్ల టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు.

షై హోప్(52; 37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (56; 34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కాలు సాధించ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ జ‌ట్టు 19.1 ఓవ‌ర్ల‌లో 171 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో న‌మ‌న్ దీర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అక్ష‌ర్ ప‌టేల్‌, కుల్దీప్ యాద‌వ్ చెరో రెండు వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్, మ‌యాంక్ యాద‌వ్ త‌లా ఓ వికెట్ సాధించాడు.

Shreyas Iyer : చ‌రిత్ర సృష్టించిన శ్రేయ‌స్ అయ్య‌ర్.. టీ20ల్లో ఏకైక భార‌త కెప్టెన్‌..

ఆత‌రువాత శ్రేయ‌స్ అయ్య‌ర్ (102 నాటౌట్; 43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) సెంచ‌రీ సాధించ‌డంతో 172 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 14.4 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిగిలిన వారిలో ఇషాన్ కిష‌న్ (37 నాటౌట్; 27 బంతుల్లో 5 ఫోర్లు), అభిషేక్ శ‌ర్మ (21; 10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. విండీస్ బౌల‌ర్ల‌లో అకీల్ హోసేన్, రోస్ట‌న్ ఛేజ్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

క‌ల నిజ‌మైంది కానీ..

మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు విజ‌యం పై శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. ఇక జ‌పాన్ నుంచి స్వదేశానికి వ‌చ్చి వెంట‌నే మ్యాచ్ ఆడాల్సిన రావ‌డంపై మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే.. సుధీర్ఘ‌ ప్రయాణం తర్వాత నేను ఎక్కడ ఉన్నానో కూడా సరిగ్గా అర్థం కాలేదు. ప్రతిరోజూ ఇలాగే నిద్రలేవాలని (తాజాదనంతో ఉండాలని) అనుకుంటున్నాను. నేను ఇక్కడి పిచ్, పరిస్థితులకు త్వరగా అలవాటు పడ్డాను. మొదట బౌలింగ్ చేయడం మాకు చాలా కలిసివచ్చిందని నా అభిప్రాయం.

భారత్, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన వన్డే సిరీస్‌లో ఎంత బాగా సాగిందో చూశాం. టీ20ల విషయానికొస్తే.. వెస్టిండీస్ జ‌ట్టు ఎంత ప్రమాదకరమైనదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందుక‌నే మా ప్ర‌ణాళిక‌ల‌ను స‌రిగ్గా అమ‌లు చేయ‌డంపైనే ఫోక‌స్ చేశాం. ప్రతి ఒక్కరూ అద్భుతంగా రాణించారు.’ అని శ్రేయ‌స్ అయ్య‌ర్ తెలిపాడు.

ఇక అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో తొలి సెంచ‌రీ సాధించ‌డం పై మాట్లాడుతూ.. ‘నిజంగా చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది. క‌ల‌లు నిజం అవుతాయ‌నే నా మాట ఈ విష‌యంలో రుజువైంది. విజ‌యం సాధించ‌డం ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో మేము అదే మాట్లాడుకుంటాము. ఒకవేళ అది మీ రోజు అయితే.. జట్టు కోసం మ్యాచ్ గెలిపించేలా చూసుకోవాలి. ఈ రోజు ఆ అవకాశం నాకు దక్కింది. గత రెండు మ్యాచ్‌లలో బ్యాటర్లు మ్యాచ్‌ను ముగించారు. మొత్తానికి ఇది అద్భుత‌మైన ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌.

Shai Hope : చాలా సంతోషంగా ఉంది.. అదొక్క‌టే మేం చేసిన మిస్టేక్ .. లేదంట‌నే..వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ కీల‌క వ్యాఖ్య‌లు..

ఇక న‌మన్ ధీర్ గురించి చెప్పాలంటే.. అత‌డు ఓ ప్రత్యేకమైన ఆటగాడు. కీలక సమయాల్లో బౌలింగ్ చేయాలనుకోవడం, బంతి టర్న్ అవుతోందని గ్రహించి, దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం అద్భుతం. అతని ప్రదర్శన ప్రశంసనీయం, అతని వైఖరి నాకు చాలా ఇష్టం. ఇక ఈ రోజు రాత్రి హాయిగా నిద్ర‌పోతాను. నాకు ఇప్ప‌టికే బాగా నిద్ర వ‌స్తోంది. సుదీర్ఘ ప్ర‌యాణం వ‌ల్ల నాతో పాటు అక్ష‌ర్ ప‌టేల్ క‌ళ్లు కూడా ఎర్ర‌బ‌డ్డాయి. టీమ్‌లోని అంద‌రి ప‌రిస్థితి ఇలాగే ఉంది.’ అని శ్రేయ‌స్ అయ్య‌ర్ అన్నాడు.