IND vs WI 2nd test : ముగిసిన మూడో రోజు ఆట.. పోరాడుతోన్న విండీస్
రెండో టెస్టులో మూడో రోజు ఆట ప్రారంభమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది.
- Thota Vamshi Kumar
- Published On : July 22, 2023 / 07:55 PM IST
WI vs IND
ముగిసిన మూడో రోజు ఆట..
మొదటి ఇన్నింగ్స్‌లో విండీస్ పోరాడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 229/5 స్కోరుతో నిలిచింది. క్రీజులో జేసన్ హోల్డర్(11), అథనేజ్(37)లు ఉన్నారు. అతిథ్య జట్టు ఇంకా 209 పరుగుల వెనుకంజలో ఉంది.
వరుణుడి ఆటంకం
రెండో టెస్టుకు వరుణుడు అంతరాయం కలిగించాడు. మెకంజీ ఔట్ అయి పెవిలియన్‌కు వెలుతున్న సమయంలోనే వర్షం పడడంతో ఆటగాళ్ల సైతం గ్రౌండ్‌ను వదిలి వెళ్లారు. ప్రస్తుతం విండీస్ స్కోరు 117/2. విండీస్ ఇంకా 321 పరుగులు వెనకబడి ఉంది.
మెకంజీ ఔట్
ముకేశ్ చౌదరి టెస్టుల్లో తన తొలి వికెట్‌ను తీశాడు. 14 పరుగుల వ్యక్తిగత ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన మెకంజీ 32 పరుగుల వద్ద వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో విండీస్ 117 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
రెండో టెస్టులో మూడో రోజు ఆట ప్రారంభమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. దీంతో విండీస్ బ్యాటింగ్‌కు దిగింది. ఓవర్ నైట్ స్కోరు 86/1తో మూడో రోజు ఆటను కొనసాగిస్తోంది. బ్రాత్‌వైట్(37), మెకంజీ(14)లు క్రీజులో ఉన్నారు. విండీస్ ఇంకా 352 పరుగులు వెనకబడి ఉంది.
