×
Ad

IND vs WI 2nd Test : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ రెండో టెస్టు.. టాస్ గెలిచిన భారత్.. గిల్ సాధించాడు.. తొలిసారి ఇలా..

IND vs WI 2nd Test : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీ వేదికగా ప్రారంభమైంది.

IND vs WI 2nd Test

IND vs WI 2nd Test : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వెస్టిండీస్ జట్టును బౌలింగ్‌కు ఆహ్వానించాడు. అయితే, గిల్ కెప్టెన్సీలో భారత జట్టు టాస్ గెలవడం ఇదే తొలిసారి. గతంలో ఆరుసార్లు గిల్ టాస్ ఓడిపోయాడు. దీంతో టాస్ అనంతరం జట్టు సభ్యులు గిల్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి అభినందనలు తెలిపారు.


భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి టెస్టులో జట్టుతోనే రెండో టెస్టులోనూ బరిలోకి దిగుతుంది. వెస్టిండీస్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. బ్రాండన్ కింగ్, జోహన్ లైన్ స్థానంలో ఆండర్సన్ ఫిలిప్, టెవిమ్ ఇమ్లాక్ జట్టులోకి వచ్చారు.
ఇదిలాఉంటే.. తొలి టెస్టులో భారత జట్టు విజయం సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులోనూ విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు.. రెండో టెస్టులో విజయంసాధించి సిరీస్‌ను సమం చేయాలని వెస్టిండీస్ పట్టుదలతో ఉంది.


భారత తుది జట్టు ఇదే..
జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్‌ గిల్ (కెప్టెన్), ధ్రువ్‌ జురెల్, రవీంద్ర జడేజా, నితీశ్‌ కుమార్‌రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్, కుల్‌దీప్, జస్ర్పీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.

వెస్టిండీస్ తుది జట్టు ఇదే..
జాన్ కాంప్‌బెల్, త్యాగనరైన్ చంద్రపాల్, అలిక్ అథనాజ్, షై హోప్, రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), టెవిన్ ఇమ్లాక్ (వికెట్ కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖారీ పియరీ, అండర్సన్ ఫిలిప్, జైదెన్ సీలెస్