Sanju Samson : ఉప్ప‌ల్‌లో భారీ మైలురాయిని అందుకున్న సంజూ శాంస‌న్‌..

Sanju Samson : టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

IND vs WI 4T20 Sanju Samson became the sixth Indian cricketer to smash 100 T20 International sixes

Sanju Samson : టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్స‌ర్ల మైలురాయిని చేరుకున్నాడు. బుధ‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో అత‌డు ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘ‌న‌త సాధించిన ఆరో భార‌త బ్యాట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు.

ఈ మ్యాచ్‌కు ముందు సంజూ శాంస‌న్ 98 సిక్స‌ర్ల‌తో ఉన్నాడు. భార‌త ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్‌లో షమర్ జోసెఫ్ బౌలింగ్‌లో వ‌రుస‌గా రెండు సిక్స‌ర్లు బాది 100 సిక్స‌ర్ల మైలురాయిని చేరుకున్నాడు. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్‌, అభిషేక్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యాలు మాత్ర‌మే సంజూ శాంస‌న్ కన్నా ముందు భార‌త్ త‌రుపున టీ20ల్లో 100 సిక్స‌ర్లు బాదారు.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్స‌ర్లు కొట్టిన భార‌త ఆట‌గాళ్లు వీరే..

* రోహిత్ శ‌ర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్స‌ర్లు
* సూర్య‌కుమార్ యాద‌వ్ – 113 మ్యాచ్‌ల్లో 179 సిక్స‌ర్లు
* అభిషేక్ శ‌ర్మ – 66 మ్యాచ్‌ల్లో 142 సిక్స‌ర్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 126 సిక్స‌ర్లు
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్‌ల్లో 124 సిక్స‌ర్లు
* సంజూ శాంస‌న్ – 76 మ్యాచ్‌ల్లో 102 సిక్స‌ర్లు

Shai Hope : భార‌త్ పై విజ‌యం.. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ కీల‌క వ్యాఖ్య‌లు..

ఇక ఈ మ్యాచ్‌లో సంజూ శాంస‌న్ అద్భుతంగా రాణించాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ సాధించాడు. మొత్తంగా 23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో 56 ప‌రుగులు చేశాడు. సంజూ శాంస‌న్ రాణించిన‌ప్ప‌టికి కూడా భార‌త్ ఈ మ్యాచ్‌లో 24 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 247 ప‌రుగులు చేసింది. కెప్టెన్ షై హోప్ (102నాటౌట్; 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స‌ర్లు) సెంచ‌రీ చేశాడు. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (26 బంతుల్లో 49 నాటౌట్), షిమ్రాన్ హెట్‌మైర్ (12 బంతుల్లో 33) వేగంగా ఆడారు. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాద‌వ్‌, అక్ష‌ర్ ప‌టేల్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Shreyas Iyer : ఉప్ప‌ల్‌లో ఆ ఒక్క త‌ప్పుతోనే ఓడిపోయాం.. లేదంటేనా.. టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కామెంట్స్ వైర‌ల్..

అనంత‌రం 248 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో టీమ్ఇండియా 19.3 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 223 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఆఖ‌రిలో అర్ష్‌దీప్ సింగ్ రిటైర్ హ‌ర్ట్‌గా పెవిలియ‌న్‌కు చేర‌డంతో టీమ్ఇండియా ఇన్నింగ్స్ 3 బంతులు ఉండ‌గానే ముగిసింది. భార‌త‌ బ్యాట‌ర్ల‌లో సంజూ శాంస‌న్ (56; 23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కం చేశాడు. తిల‌క్ వ‌ర్మ (25 బంతుల్లో 43), నితీశ్ కుమార్ రెడ్డి (20 బంతుల్లో 41) రాణించారు. వెస్టిండీస్ బౌల‌ర్ల‌లో కీమో పాల్ ఐదు వికెట్ల‌తో భార‌త ప‌తనాన్ని శాసించాడు. గుడాకేష్ మోటీ రెండు వికెట్లు తీశాడు. షమర్ స్ప్రింగర్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.