World Championship of Legends 2026 : యువరాజ్ సింగ్ విఫలం.. వెస్టిండీస్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన ఇండియా ఛాంపియన్స్..
World Championship of Legends 2026 : వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2026లో ఇండియా ఛాంపియన్స్ ప్రయాణం ముగిసింది.
World Championship of Legends 2026 West Indies beat India
World Championship of Legends 2026 : వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2026లో ఇండియా ఛాంపియన్స్ ప్రయాణం ముగిసింది. మంగళవారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఛాంపియన్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ జట్టు సెమీస్కు చేరకుండానే నిష్ర్కమించింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రిషి ధావన్ (34; 32 బంతుల్లో 4 ఫోర్లు), హర్భజన్ సింగ్ (28 నాటౌట్; 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించారు. రాబిన్ ఉతప్ప (19) పర్వాలేనిపించగా ఓపెనర్ నమన్ ఓజా, వన్డౌన్ బ్యాటర్ అంబటి రాయుడు డకౌట్లు అయ్యారు.
Tilak Varma : సొంత గడ్డ ఉప్పల్లో తిలక్ వర్మ.. శతక సిక్సర్ల రికార్డు అందుకునేనా ?
స్టువర్ట్ బిన్ని (1), యువరాజ్ సింగ్ (4), యూసఫ్ పఠాన్ (11) లు ఘోరంగా విఫలం అయ్యారు. ఓ దశలో 47 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఇండియా ఛాంపియన్స్ వంద పరుగులు చేయడం కూడా కష్టమే అని అనిపించింది. రిషి ధావన్, హర్భజన్ సింగ్ రాణించడంతో 100 పరుగులు దాటింది. వెస్టిండీస్ బౌలర్లలో రయాద్ ఎమ్రిట్ రెండు వికెట్లు తీయగా.. ఫిడెల్ ఎడ్వర్డ్స్, షెల్డన్ కాట్రెల్, రేమన్ రీఫర్, కార్లోస్ బ్రాత్వైట్, నికితా మిల్లర్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వెస్టిండీస్ 14.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెస్టిండీస్ బ్యాటర్లలో క్రిస్ గేల్ (1), జెర్మైన్ బ్లాక్వుడ్ (5) లు విఫలమైనా చాడ్విక్ వాల్టన్ (60; 43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడికి లెండల్ సిమన్స్ (22; 26 బంతుల్లో 1 ఫోర్ ) చక్కని సహకారం అందించారు. భారత బౌలర్లలో ధావల్ కులకర్ణి రెండు వికెట్లు తీశాడు. రిషి ధావన్, పీయూష్ చావ్లా చెరో వికెట్ పడగొట్టారు.
