Gold-Silver Prices Today : గోల్డ్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన ధర.. ప్రస్తుతం తులం ఎంతంటే?
Gold-Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. నేడు గోల్డ్ రేటు భారీగా తగ్గింది.

Gold-Silver Prices Today : దసరా పండుగ వేళ బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవున్నవారికి అదిరిపోయే శుభవార్త. బంగారం ధర భారీగా తగ్గింది.

బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 1030 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 950 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. దీంతో అక్కడ ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,166 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.. గత పదిరోజులుగా వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,48,260 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,35,900 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,48,410 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,36,050 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,48,260కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,35,900 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,35,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
