Vaibhav Sooryavanshi : మూడో టీ20 మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసం.. 8 ఫోర్లు, 4 సిక్సర్లు.. నువ్వు మామూలోడివి కాదు సామీ..
హరారే వేదికగా జింబాబ్వేతో మూడో టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 26, 2026 / 06:00 PM IST
IND vs ZIM 3rd T20 Vaibhav Sooryavanshi second half century in Zimbabwe tour
Vaibhav Sooryavanshi : హరారే వేదికగా జింబాబ్వేతో మూడో టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. జింబాబ్వే బౌలర్లకు పట్ట పగలే చుక్కలు చూపించాడు. కేవలం 49 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 81 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ ఆఖరి బంతికి మధెవెరే బౌలింగ్‌లో లాంగాఫ్ దిశగా భారీ షాట్‌కు యత్నించాడు. బౌండరీ లైన్ వద్ద బ్రాడ్ ఎవాన్స్ చక్కని క్యాచ్ అందుకోవడంతో వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ ముగిసింది.
తృటిలో శతకాన్ని చేజార్చుకున్నప్పటికి కూడా వైభవ్ సూర్యవంశీ ఔటై పెవిలియన్‌కు వెలుతున్న సమయంలో డగౌట్‌లోని ఆటగాళ్లతో పాటు మైదానంలోని ప్రేక్షకులు లేచి నిలబడి మరీ చప్పట్లతో అతడి ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇంగ్లాండ్‌లో విఫలమైనా..
ఇంగ్లాండ్ సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్ ద్వారా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో ఇంగ్లాండ్‌తో ఆఖరి టీ20 మ్యాచ్‌లో తుది జట్టులో చోటు కోల్పోయాడు.
8️⃣1️⃣ runs
4️⃣9️⃣ deliveries
8️⃣ fours
4️⃣ sixesVaibhav Sooryavanshi thrilled Harare with another special outing 🌟👏
Updates ▶️ https://t.co/oApMpI6eRc#TeamIndia | #ZIMvIND pic.twitter.com/mkCLNzWNQe
— BCCI (@BCCI) July 26, 2026
అయితే.. జింబాబ్వే పర్యటనలో మాత్రం అదరగొట్టాడు. తొలి టీ20 మ్యాచ్‌ల్లో కేవలం 19 బంతుల్లో 50 పరుగులు చేసిన వైభవ్ రెండో టీ20 మ్యాచ్‌లో 9 బంతుల్లో 20 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మూడో మ్యాచ్‌లో విజృంభించి 49 బంతుల్లోనే 81 పరుగులు సాధించాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌ల్లో 151 పరుగులు చేసి తన సత్తాను చాటుకున్నాడు.
