IND-W vs ENG-W 1st T20 : మొదటి టీ20లో ఓడిన టీమ్ఇండియా
మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ మహిళల జట్టుతో భారత మహిళల జట్టు ముంబై వేదికగా తలపడ్డాయి.
- Thota Vamshi Kumar
- Updated on- December 6, 2023 / 10:14 PM IST
IND-W vs ENG-W 1st T20
ఓడిన భారత్..
భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 159 పరుగులకు పరిమితమైంది.
టీమ్ఇండియా టార్గెట్ 198
నాట్ స్కివర్-బ్రంట్ (77; 53 బంతుల్లో 13 ఫోర్లు), డేనియల్ వ్యాట్ (75; 47 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో బాదడంతో ఇంగ్లాండ్ మహిళ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. మిగిలిన వారిలో అమీ జోన్స్ (23; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. సోఫియా డంక్లీ (1), అలిస్ క్యాప్సే (0), హీథర్ నైట్ (6) విఫలం అయ్యారు. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్ సింగ్ మూడు వికెట్లు తీసింది. శ్రేయాంక పాటిల్ రెండు, సైకా ఇషాక్ ఓ వికెట్ పడగొట్టారు.
10 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 89/2
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో సగం ఓవర్లు ముగిశాయి. 10 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 89/2. నాట్ స్కివర్-బ్రంట్ (36), డేనియల్ వ్యాట్ (44) లు ఆడుతున్నారు.
భారత మహిళల తుది జట్టు : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, పూజా వస్త్రాకర్, రేణుకా ఠాకూర్ సింగ్, సైకా ఇషాక్
ఇంగ్లండ్ మహిళల తుది జట్టు : డేనియల్ వ్యాట్, సోఫియా డంక్లీ, అలిస్ క్యాప్సే, నాట్ స్కివర్-బ్రంట్, హీథర్ నైట్(కెప్టెన్), అమీ జోన్స్(వికెట్ కీపర్), ఫ్రెయా కెంప్, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, లారెన్ బెల్, మహికా గౌర్
టాస్..
మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ మహిళల జట్టుతో భారత మహిళల జట్టు ముంబై వేదికగా తలపడుతోంది. టాస్ గెలిచిన టీమ్ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
