Ind Vs Eng: ఇంగ్లాండ్‌‌పై భారత్ విజయం.. వన్డే సిరీస్ కైవసం..

84 బంతుల్లో 102 పరుగులు చేసింది. 14 ఫోర్లు బాదింది.

Ind Vs Eng: ఇంగ్లాండ్ తో మూడో వన్డేలో భారత మహిళల జట్టు చెలరేగింది. ఇంగ్లాండ్ పై 13 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ చేసింది. 319 రన్స్ భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. 305 పరుగులకే పరిమితమైంది. 49.5 ఓవర్లలో ఆలౌట్ అయ్యింది.

ఇంగ్లాండ్ బ్యాటర్లలో బ్రంట్ చెలరేగింది. 105 బంతుల్లో 98 పరుగులు చేసింది. 11 ఫోర్లు కొట్టింది. ఎమ్మా లాంబ్ హాఫ్ సెంచరీతో రాణించింది. 81 బంతుల్లో 68 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ వెన్ను విరిచింది. శ్రీ చరణి రెండు వికెట్ల తీసింది. దీప్తి శర్మ ఒక వికెట్ పడగొట్టింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్ సూపర్ సెంచరీతో చెలరేగింది. 84 బంతుల్లో 102 పరుగులు చేసింది. 14 ఫోర్లు బాదింది. జట్టు మూడొందల పరుగుల భారీ స్కోర్ సాధించడంలో హర్మన్‌ కీ రోల్ ప్లే చేసింది. భారత్‌కు ఓపెనర్ స్మృతి మంధాన‌ మెరుపు ఆరంభాన్ని ఇచ్చింది. 54 బంతుల్లో 45 పరుగులు చేసింది. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు హర్లీన్ డియోల్ (45), జెమీమా రోడ్రిగ్స్ (50) చెలరేగారు. వీరు ధాటిగా ఆడటంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 318 రన్స్ చేసింది.

ఈ గెలుపుతో వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్ లో భారత్ రెండు మ్యాచులు నెగ్గింది.