×
Ad

Womens Asia Cup Rising Stars 2026 : మ‌హిళ‌ల ఆసియాక‌ప్ రైజింగ్ స్టార్స్ 2026 విజేత‌గా భార‌త్‌..

మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 (Womens Asia Cup Rising Stars 2026) విజేత‌గా భార‌త్ నిలిచింది.

India A won the Womens Asia Cup Rising Stars 2026

Womens Asia Cup Rising Stars 2026 : మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 విజేత‌గా భార‌త్ నిలిచింది. ఆదివారం బ్యాంకాక్ వేదిక‌గా బంగ్లాదేశ్-ఏ మ‌హిళ‌ల జ‌ట్టుతో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త మ‌హిళ‌ల-ఏ జ‌ట్టు 46 ప‌రుగులు తేడాతో గెలుపొందింది.

135 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బంగ్లాదేశ్ జ‌ట్టు 19.1 ఓవ‌ర్ల‌లో 88 ప‌రుగుల‌కు ఆలౌటైంది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో షమీమా సుల్తానా (20), సర్మిన్ సుల్తానా (18) లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో ప్రేమ రావత్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టింది. సోనియా మెంధియా, తనుజా కన్వర్ లు చెరో రెండు వికెట్లు తీశారు. కెప్టెన్ రాధా యాద‌వ్, సైమా ఠాకూర్, మిన్ను మణి లు త‌లా ఓ వికెట్ సాధించారు.

T20 World Cup 2026 : వ‌ర్షం కార‌ణంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ ర‌ద్దు.. పాకిస్థాన్ సెమీస్ చేరుకునేందుకు ఇంకా ఛాన్సుందా?


అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 134 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో తేజల్ హసబ్నిస్ (51 నాటౌట్; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశారు. కెప్టెన్ రాధా యాద‌వ్ (36; 30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించింది.

IND vs SA : భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు ఉందా? ర‌ద్దు అయితే ప‌రిస్థితి ఏంటి?

44 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ప‌డిన భార‌త్ ను రాధా, తేజ‌ల్‌లు ఆదుకున్నారు. వీరిద్ద‌రు ఐదో వికెట్‌కు 69 ప‌రుగులు జోడించారు. బంగ్లా బౌల‌ర్ల‌లో ఫాహిమా ఖాతున్ నాలుగు వికెట్లు తీసింది. ఫర్జానా ఈస్మిన్, ఫాతేమా జహాన్ సోనియా చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.