IND vs AUS 3rd T20 : ప్ర‌పంచ రికార్డుపై క‌న్నేసిన భార‌త్‌.. ఒక్క అడుగు దూరంలో

India vs Australia 3rd T20 : భార‌త జ‌ట్టును సిరీస్‌తో పాటు ఓ ప్ర‌పంచ రికార్డు ఊరిస్తోంది.

IND vs AUS 3rd T20

మొద‌టి రెండు టీ20 మ్యాచుల్లో విజ‌యం సాధించిన టీమ్ఇండియా గౌహ‌తి వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న మూడో టీ20 మ్యాచ్‌కు సిద్ధ‌మౌతోంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని భార‌త్ భావిస్తోండ‌గా క‌నీసం ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిల‌వాల‌ని ఆసీస్ ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టును సిరీస్‌తో పాటు ఓ ప్ర‌పంచ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో గ‌నుక టీమ్ఇండియా గెలిస్తే సిరీస్ సొంతం అవ్వ‌డంతో పాటు అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్య‌ధిక విజ‌యాలు సాధించిన జ‌ట్టుగా భార‌త్ నిల‌వ‌నుంది.

తిరువ‌నంత‌పురంలో జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో గెలిచిన భార‌త్.. పాకిస్తాన్‌తో సంయుక్తంగా అత్య‌ధిక విజ‌యాలు సాధించిన జ‌ట్టుగా నిలిచింది. టీమ్ఇండియా, పాకిస్తాన్ జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు చెరో 135 టీ20 మ్యాచుల్లో గెలుపొందాయి. టీమ్ఇండియా 211 మ్యాచులు ఆడ‌గా, పాకిస్తాన్ 226 మ్యాచులు ఆడింది. గౌహ‌తిలో విజ‌యం సాధిస్తే 136 విజ‌యాల‌తో భార‌త్ అగ్ర‌స్థానంలో నిల‌వ‌నుంది.

IND vs AUS : వ‌రుస ఓట‌ముల ఎఫెక్ట్‌..! సిరీస్ మ‌ధ్య‌లో ఆరుగురు ఆట‌గాళ్ల‌ను మార్చిన ఆస్ట్రేలియా

గౌహ‌తి పిచ్ రిపోర్టు..

గౌహ‌తిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలోని వికెట్ చాలా స్లోగా ఉంటుంది. ఈ వేదిక పై 2002 అక్టోబ‌ర్‌లో చివ‌రి టీ20 మ్యాచ్ జ‌రిగింది. భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచులో రెండు జ‌ట్లు క‌లిపి 400 కంటే ఎక్కువ ప‌రుగులు చేశాయి. ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్‌

IND vs AUS హెడ్ టు హెడ్ రికార్డు..

భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. టీమ్ఇండియా 17 మ్యాచుల్లో, ఆస్ట్రేలియా 10 విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్ లో ఫలితం తేల‌లేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఎనిమిది టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించింది.

Suryakumar Yadav : సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఊరిస్తోన్న అరుదైన రికార్డు.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసే అద్భుత అవ‌కాశం