Abhishek Sharma : అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించేనా? టీ20ల్లో విరాట్ కోహ్లీ 9 ఏళ్ల రికార్డు పై కన్ను..
టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్నాడు.
Abhishek Sharma needs 87 runs more to break Virat Kohli long standing T20 record
Abhishek Sharma : టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్నాడు. టీ20ల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు 39 టీ20లు ఆడిన అతడు ఏకంగా 1533 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు, తొమ్మిది అర్థశతకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఓ అరుదైన రికార్డుకు అతడు అడుగుదూరంలో ఉన్నాడు.
ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు అభిషేక్‌కు (Abhishek Sharma) మరో 87 పరుగులు అవసరం. ప్రస్తుతం ఈ రికార్డు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. 2016లో టీ20ల్లో కోహ్లీ ఏకంగా 1614 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలు, 14 అర్థశతకాలు ఉన్నాయి.
భారత జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్‌లు ముగిశాయి. మరో మూడు మ్యాచ్‌లు భారత్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీ రికార్డును అందుకోవడం అభిషేక్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు.
ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20 పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
* విరాట్ కోహ్లీ – 1614 పరుగులు (2016లో)
* అభిషేక్ శర్మ – 1533* పరుగులు (2025లో)
* సూర్యకుమార్ యాదవ్ – 1503 పరుగులు (2022లో)
* సూర్యకుమార్ యాదవ్ – 1338 పరుగులు (2023లో)
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో అభిషేక్ పెద్దగా రాణించలేకపోయాడు. రెండు మ్యాచ్‌ల్లో అతడు 17 పరుగులు మాత్రమే చేశాడు. ఇక భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు (ఆదివారం డిసెంబర్ 14న) ధర్మశాల వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
