IND vs PAK : భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ నేడే.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసాన్ని ఎక్కడ చూడొచ్చంటే?
టోర్నీ ఏదైనా సరే భారత్, పాకిస్తాన్ జట్లు (IND vs PAK) తలపడుతున్నాయంటే వచ్చే కిక్కే వేరు.
U19 Asia Cup 2025 Do you know where to watch India U19 vs Pakistan U19 match today
IND vs PAK : టోర్నీ ఏదైనా సరే భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయంటే వచ్చే కిక్కే వేరు. అండర్-19 ఆసియాకప్ 2025లో భాగంగా నేడు (ఆదివారం డిసెంబర్ 14న) చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ ఈ మ్యాచ్‌కు (IND vs PAK )ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ టోర్నీలో భారత్, పాక్ జట్లు తమ తమ మొదటి మ్యాచ్‌ల్లో విజయం సాధించి గెలుపుతో టోర్నీని ప్రారంభించాయి. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 234 పరుగుల తేడాతో భారత్ గెలవగా, మలేషియా పై పాక్ 297 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వైభవ్ సూర్యవంశీ పైనే అందరి దృష్టి..
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా నయా సంచలనం, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పైనే అందరి దృష్టి నెలకొంది. తనదైన శైలిలో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతూ అభిమానుల మనసులను దోచుకుంటున్న అతడు.. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో 95 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లు కొట్టి 171 పరుగులను సాధించాడు. పాక్‌తో మ్యాచ్‌లోనూ అతడు చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు
హెడ్-టు-హెడ్..
భారత్, పాక్ జట్ల మధ్య ఇప్పటి వరకు 27 యూత్ వన్డేలు జరిగాయి. ఇందులో భారత్ 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 11 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక అండర్-19 ఆసియా కప్‌లో ఇరు జట్లు 10 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలడ్డాయి. ఇందులో భారత్ 4 మ్యాచ్‌ల్లో గెలవగా, పాక్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.
ఎక్కడ చూడొచ్చంటే?
సోనీ టీవీ నెట్‌వర్క్ అండర్-19 ఆసియాకప్ 2025కి అధికారిక బ్రాడ్‌కాస్టర్. దీంతో మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షప్రసారం అవుతాయి. ఇక మొబైల్‌లో అయితే.. సోనీ లివ్ యాప్‌లో మ్యాచ్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.
Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ పై మాజీ ఆటగాడి ఆగ్రహం.. టాస్ వేస్తే సరిపోతుందా?
అండర్-19 ఆసియాకప్ 2025కి భారత జట్టు ఇదే..
ఆయుష్ మత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్), యువరాజ్ గోహిల్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ ఏ. పటేల్, నమన్ పుష్పక్, డి. దీపేష్, హెనిల్ పటేల్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్, ఆరోన్ జార్జ్.
