IND vs SA : ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్.. హార్దిక్ పాండ్యాను ఊరిస్తున్న అరుదైన ఘనత
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA) ధర్మశాల వేదికగా ఆదివారం (నవంబర్ 14న) మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
IND vs SA 3rd T20 Hardik Pandya one wicket away for 100t20 international wickets
IND vs SA : ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ధర్మశాల వేదికగా ఆదివారం (నవంబర్ 14న) మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి టీ20 మ్యాచ్‌లో భారత్, రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్లు విజయం సాధించాయి. ఈ క్రమంలో మూడో టీ20 మ్యాచ్‌లో (IND vs SA) గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
ఇక ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఓ మైలురాయి ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ ఒక్క వికెట్ తీస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వంద వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. అదే విధంగా టీమ్ఇండియా తరుపున టీ20ల్లో వంద వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రాలు మాత్రమే ఇప్పటి వరకు ఈ ఘనత సాధించారు.
Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ పై మాజీ ఆటగాడి ఆగ్రహం.. టాస్ వేస్తే సరిపోతుందా?
హార్దిక్ ఇప్పటి వరకు 122 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 99 వికెట్లు తీశాడు. మూడు సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు. అత్యుత్తమ ప్రదర్శన 4/16.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే..
* అర్ష్‌దీప్ సింగ్ – 107 వికెట్లు
* జస్‌ప్రీత్ బుమ్రా – 79 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 99 వికెట్లు
* యుజ్వేంద్ర చాహల్ – 96 వికెట్లు
* భువనేశ్వర్ కుమార్ – 90 వికెట్లు
