Vaibhav Suryavanshi : పాక్‌తో మ్యాచ్‌.. వైభ‌వ్ సూర్య‌వంశీ విఫ‌లం.. 6 బంతులు ఆడి..

పాక్‌తో మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) విఫ‌లం అయ్యాడు.

Vaibhav Suryavanshi : పాక్‌తో మ్యాచ్‌.. వైభ‌వ్ సూర్య‌వంశీ విఫ‌లం.. 6 బంతులు ఆడి..

U19 Asia Cup 2025 India vs Pakistan match Vaibhav Suryavanshi fail

Updated On : December 14, 2025 / 12:14 PM IST

Vaibhav Suryavanshi : అండ‌ర్‌-19 ఆసియాక‌ప్ 2025లో భాగంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడ‌మీ గ్రౌండ్‌లో భార‌త్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ప్రారంభమైంది. వ‌ర్షం కార‌ణంగా టాస్ ఆల‌స్య‌మైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ మ‌రో ఆలోచ‌న లేకుండా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ మొద‌ట బ్యాటింగ్‌కు దిగింది. వ‌ర్షం వ‌ల్ల మ్యాచ్‌ను 49 ఓవ‌ర్ల‌కు కుదించారు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది. యూఏఈతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో 95 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్స‌ర్ల సాయంతో 171 ప‌రుగులను సాధించిన వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Suryavanshi )పాక్‌తో మ్యాచ్‌లో విఫ‌లం అయ్యాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్‌లో పాక్ పేస‌ర్‌ మహ్మద్ సయ్యం బౌలింగ్‌లో అత‌డికే క్యాచ్ ఇచ్చి సూర్య‌వంశీ ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో సూర్య‌వంశీ మొత్తంగా 6 బంతులు ఎదుర్కొని ఓ ఫోర్ సాయంతో 5 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

IND vs SA : దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్‌.. తిల‌క్ వ‌ర్మ కామెంట్స్.. నేను సిద్ధం… గంభీర్ మాత్రం..

దీంతో భార‌త్ 3.2 ఓవ‌ర్ల‌లో 29 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది.

భారత తుది జట్టు..

ఆయుష్‌ మాత్రే (కెప్టెన్‌), వైభవ్‌ సూర్యవంశీ, అరోజ్‌ జార్జి, విహాన్‌ మల్హోత్రా, వేదాంత్‌ త్రివేది, అభిజ్ఞాన్‌ కుందు (వికెట్‌ కీపర్‌), కాన్షిక్‌ చౌహాన్‌, ఖిలాన్‌ పటేల్‌, దీపేశ్‌ దేవేంద్రన్‌, కిషన్‌ కుమార్‌ సింగ్‌, హేనిల్‌ పటేల్‌

Abhishek Sharma : అభిషేక్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించేనా? టీ20ల్లో విరాట్ కోహ్లీ 9 ఏళ్ల రికార్డు పై క‌న్ను..

పాకిస్థాన్‌ తుది జట్టు..

ఉస్మాన్‌ ఖాన్‌, సమీర్‌ మిన్హాస్‌, అలి హసన్‌ బలోచ్‌, అహ్మద్‌ హుస్సేన్‌, ఫర్హాన్‌ యూసఫ్‌ (కెప్టెన్‌), హమ్జా జహూర్‌ (వికెట్‌ కీపర్‌), హుజైఫా అషన్‌, నికబ్‌ సాఫిక్‌, అబ్దుల్‌ సుభాన్‌, మహ్మద్‌ సయ్యమ్‌, అలీ రాజా