IND vs AUS : ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌.. అశ్విన్‌కు చోటు.. భారత‌ జట్టు ఇదే..

ఆస్ట్రేలియాతో ఆడ‌నున్న మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్‌లో పాల్గొనే భార‌త జ‌ట్టును భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్ర‌క‌టించింది.

India vs Australia : ఆస్ట్రేలియాతో ఆడ‌నున్న మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్‌లో పాల్గొనే భార‌త జ‌ట్టును భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్ర‌క‌టించింది. మొద‌టి రెండు మ్యాచుల‌కు సీనియ‌ర్ ఆట‌గాళ్లు అయిన రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య ల‌కు విశ్రాంతి ఇచ్చింది. అలాగే.. ఆసియాక‌ప్‌లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గాయ‌ప‌డిన ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్‌ను తొలి రెండు వ‌న్డేల‌కు ప‌క్క‌న బెట్టారు. అత‌డి స్థానంలో సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌కు చోటు ఇచ్చారు.

మొద‌టి రెండు మ్యాచుల‌కు రెగ్యుల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ దూరం కావ‌డంతో అత‌డి స్థానంలో ఈ మ్యాచుల‌కు కేఎల్ రాహుల్ నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నాడు. హైద‌రాబాదీ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ‌ను తొలి రెండు వ‌న్డేల‌కు ఎంపిక చేశారు. మూడో వ‌న్డేకు రోహిత్, కోహ్లీ, హార్దిక్ జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నారు. దీంతో మూడో వ‌న్డేకు మ‌ళ్లీ రోహిత్ శ‌ర్మ‌నే కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించ‌నున్నాడు.

మొద‌టి రెండు వ‌న్డేల‌కు భార‌త జ‌ట్టు ఇదే..

కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, ర‌విచంద్ర‌న్ అశ్విన్, జ‌స్‌ప్రీత్ బుమ్రా, షమీ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

మూడో వ‌న్డేకు భార‌త జ‌ట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ర‌విచంద్ర‌న్‌ అశ్విన్, జ‌స్‌ప్రీత్‌ బుమ్రా, షమీ, సిరాజ్

షెడ్యూల్ ఇదే..

మొద‌టి వ‌న్డే – సెప్టెంబ‌ర్ 22న – మొహాలీ
రెండో వ‌న్డే – సెప్టెంబ‌ర్ 24న – ఇండోర్‌
మూడో వ‌న్డే – సెప్టెంబ‌ర్ 27న – రాజ్‌కోట్

ప్ర‌పంచ‌క‌ప్ ముందు ఇరు జ‌ట్లు ఈ సిరీస్‌ను ప్రాక్టీస్‌గా ఉప‌యోగించుకోనున్నాయి. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ముగిసిన త‌రువాత ఇరు జ‌ట్ల మ‌ధ్య న‌వంబ‌ర్ 23 నుంచి ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
ODI Rankings : నంబ‌ర్ వ‌న్ ర్యాంకుతో ప్ర‌పంచ‌క‌ప్‌లో అడుగుపెట్టేది ఎవ‌రో..? అగ్ర‌స్థానం కోసం మూడు జ‌ట్ల మ‌ధ్య పోటీ..?

ట్రెండింగ్ వార్తలు