T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచులో దక్షిణాఫ్రికా 187 పరుగులు చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే.
దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ విఫలం కాగా, ఆ తర్వాత వచ్చిన డెవాల్డ్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ క్రీజులో నిలదొక్కుకుని ఆడడంతో దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
India vs South Africa: బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. ఒక్క మార్పూ లేకుండా టీమిండియా..
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మార్క్రమ్ 4, క్వింటన్ డికాక్ 6, ర్యాన్ రికెల్టన్ 7, డెవాల్డ్ బ్రేవిస్ 45, డేవిడ్ మిల్లర్ 63, ట్రిస్టన్ స్టబ్స్ 44 (నాటౌట్), మార్కో జాన్సెన్ 2, కార్బిన్ బోష్ 5, కగిసో రబాడా 0 పరుగులు చేశారు.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3, అర్ష్‌దీప్ సింగ్ 2, వరుణ్ చక్రవర్తి, శివం దూబే చెరో వికెట్ పడగొట్టారు.