IRE vs IND
India to tour Ireland : డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓటమి తరువాత నెల రోజుల విరామం అనంతరం టీమ్ఇండియా (Team India) వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో విండీస్‌తో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ పర్యటన ముగిసిన వెంటనే భారత్ జట్టు ఐర్లాండ్ (Ireland) కు వెళ్లనుంది. ఐర్లాండ్ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. ఆగస్టు 18 నుంచి 23 వ తేదీ మధ్యలో మ్యాచ్‌లు జరగనున్నాయి.
షెడ్యూల్ విడుదల అనంతరం ఐర్లాండ్ క్రికెట్ సీఈఓ వారెన్ డియోట్రమ్ మాట్లాడుతూ.. సంవత్సరం లోపే టీమ్ఇండియా జట్టు రెండోసారి ఐర్లాండ్‌లో పర్యటించనుండడం ఎంతో ఆనందంగా ఉంది. భారత ఆటగాళ్లకు స్వాగతం చెప్పేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ సారి మూడు మ్యాచ్‌లు టీమ్ఇండియా ఆడనుందని, అభిమానులు ఆకట్టుకునేలా మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బీసీసీఐకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఐర్లాండ్ పర్యటన ముగిసిన వారం తరువాత ఆసియా కప్ 2023 ప్రారంభం కానుంది.
Virender Sehwag : అప్పుడు సచిన్ కోసం గెలిచాం.. ఇప్పుడు కోహ్లి కోసం గెలవండి
గతేడాది కూడా భారత జట్టు ఐర్లాండ్‌లో పర్యటించింది. హార్ధిక్ నేతృత్వంలో 2-0 తో క్లీన్ స్వీప్ చేసింది. అంతకముందు 2018లో కూడా టీమ్ఇండియా ఐర్లాండ్‌కు వెళ్లింది. అప్పుడు కూడా 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొత్తంగా ఇప్పటి వరకు ఐర్లాండ్‌తో 5 మ్యాచులు జరిగాయి. ఈ ఐదు మ్యాచుల్లో సైతం భారత్ విజేతగా నిలిచింది.
ఐర్లాండ్ షెడ్యూల్ ఇదే..
– తొలి టీ20 ఆగస్ట్ 18
– రెండో టీ20 ఆగస్ట్ 20
– మూడో టీ20 ఆగస్ట్ 23
ఈ మూడు మ్యాచులు కూడా డబ్లిన్‌లోని మలాహిడే వేదికగానే జరగనున్నాయి.
Virender Sehwag : ధోని కిచిడీ సెంటిమెంట్ తెలుసా..? ఆ ప్రపంచకప్ మొత్తం అదే తిన్నాడు.. ఎందుకంటే..?