IND vs SA : ప్రధాన వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

మూడో వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్ లో నాలుగు మార్పులతో బరిలోకి దిగింది...

India Tour Of South Africa : సౌతాఫ్రికతో టీమిండియా వన్డే సిరీస్ కొనసాగుతోంది. మూడో వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా..ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికాకు షాక్ ఇచ్చారు భారత బౌలర్లు. ఓపెనర్ మలన్ ఒకే పరుగు సాధించి..చాహర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన బవుమా చెలరేగిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ..అనూహ్యంగా బవుమా (8) రన్ అవుట్ అయ్యాడు. అయితే..ఓపెనర్ గా వచ్చిన డికాక్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. జట్టు స్కోరు 70 పరుగుల వద్ద ఉన్నప్పుడు మార్ క్రమ్ (15) వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 13.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా 73 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో చాహర్ 2 వికెట్లు తీశాడు.

Read More : Omicron Transmission: కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ దశలో ఒమిక్రాన్.. పెరుగుతున్న ప్రమాదం!

మరోవైపు తొలి రెండు వన్డేలో భారత్ పరాజయం పొందిన సంగతి తెలిసిందే. కనీసం మూడో వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్ లో నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్, ప్రసిద్ద్ కృష్ణ, జయంత్ యాదవ్ లు జట్టులోకి తీసుకున్నారు. భువీ, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, వెంకటేశ్ అయ్యర్ ల స్థానంలో వీరిని తీసుకున్నారు. తొలి రెండు మ్యాచ్ ల్లో పేసర్ భువనేశ్వర్ కుమార్ పేవిలియమైన ప్రదర్శన కనబరిచాడు. స్పిన్నర్ అశ్విన్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ లు రాణించకపోవడంతో వీరిని పక్కకు తప్పించారు. వన్డే సిరీస్ ను 2-0 తో కైవసం చేసుకున్న సౌతాఫ్రికాలు ఈ మ్యాచ్ లో కూడా గెలిచి…సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని కసితో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు