IND vs ZIM : గురువారం నుంచి జింబాబ్వేతో టీ20 సిరీస్‌.. జియో, సోనీల‌లో రాదు.. ఎక్క‌డ చూడొచ్చంటే?

జూలై 23 నుంచి భార‌త్, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య (IND vs ZIM) మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

India Tour of Zimbabwe 2026 Full Schedule Live Telecast Streaming Match Timings

IND vs ZIM : వ‌రుస‌గా రెండు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ల‌ను భార‌త జ‌ట్టు కైవ‌సం చేసుకుంది. అయితే..అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌, వైభ‌వ్ సూర్య‌వంశీ, ఇషాన్ కిష‌న్‌ వంటి యువ భీక‌ర హిట్టింగ్ ఆట‌గాళ్ల‌తో నిండి ఉన్న భార‌త జ‌ట్టు ఇటీవ‌ల‌ అనూహ్యంగా ప‌రాజ‌యాల‌ను చవిచూస్తోంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 త‌రువాత టీమ్ఇండియా ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడ‌గా ఒక్క మ్యాచ్‌లోనూ గెలుపొంద‌లేదు. ఓ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కాగా మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

ప‌సిన‌కూన ఐర్లాండ్ చేతిలో 2-0 తేడాతో, ఇంగ్లాండ్ పై 4-0 తేడాతో ఓట‌ముల‌ను చ‌విచూసింది. ఇక ఇప్పుడు జింబాబ్వేతో సిరీస్‌కు సిద్ధమైంది. జూలై 23 నుంచి భార‌త్, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. హ‌రారే వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకోవాల‌ని టీమ్ఇండియా ప‌ట్టుద‌ల‌గా ఉంది.

Ashwin : రోహిత్, కోహ్లీల‌ను ఎవ‌రూ ట‌చ్ చేయ‌లేరు.. అశ్విన్ కీల‌క వ్యాఖ్య‌లు.. రెండు ప్ర‌ధాన కార‌ణాలు ఉన్నాయ‌ట‌..

టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌యాన్ని అందుకోలేదు. జింబాబ్వే సిరీస్‌లోనూ భార‌త్ ఓట‌మి పాలైతే అత‌డి నాయ‌క‌త్వానికి ముప్పు త‌ప్ప‌దు.

వైభ‌వ్ సూర్య‌వంశీ పైనే అంద‌రి దృష్టి..

సీనియ‌ర్ ఆట‌గాడు సంజూ శాంస‌న్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి వైభ‌వ్ సూర్య‌వంశీ పైనే ఉంది. అత‌డు అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి ఓపెనింగ్ చేయ‌నున్నాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్ ద్వారా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన బుడ్డోడు ఆశించిన స్థాయిలో రాణించ‌లేదు. దీంతో మూడు మ్యాచ్‌ల త‌రువాత అత‌డిని జ‌ట్టు నుంచి పక్క‌న పెట్టిన సంగ‌తి తెలిసిందే.

ఎక్క‌డ చూడొచ్చంటే ?

భార‌త్‌, జింబాబ్వే టీ20 సిరీస్ హ‌క్కుల‌ను జీ నెట్‌వ‌ర్క్‌కు చెందిన యునైటెడ్8 స్పోర్ట్స్ ద‌క్కించుకుంది. దీంతో టీవీల్లో యునైట్‌8 స్పోర్ట్ ఛాన‌ల్స్‌లో మ్యాచ్‌లు ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం కానున్నాయి. ఇక ఓటీటీ విష‌యానికి వ‌స్తే.. ఫ్యాన్ కోడ్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ రెండింటిలో ఫ్రీగా చూసే అవ‌కాశం లేదు. స‌బ్‌స్ర్కిప్ష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది.

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ఇదే..

వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, రవిబిష్ణోయ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సూర్యన్ష్ షెడ్జే, అశోక్ శర్మ.

IND vs ZIM : ఇంగ్లాండ్ గ‌డ్డ పై చేదు ఫ‌లితాలు.. అప్పుడే మ‌రో సిరీస్‌.. వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌చ్చేశాడు..

భార‌త్, జింబాబ్వే షెడ్యూల్ ఇదే..

* తొలి టీ20 మ్యాచ్ – జూలై 23న
* రెండో టీ20 మ్యాచ్ – జూలై 25న‌
* మూడో టీ20 మ్యాచ్ – జూలై 26న

ఈ మూడు మ్యాచ్‌లు హ‌రారే వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం సాయంత్రం 4.30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానున్నాయి.