IPL auction 2022: వేలంలో అండర్-19 ప్రపంచ కప్‌ విజేతలు..

ఫిబ్రవరి 12-13 తేదీల్లో బెంగళూరులో జరుగుతున్న IPL మెగా వేలంలో, అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్‌ను విజేతగా నిలిపిన ఆటగాళ్లు కూడా వేలం వేయబడతారు.

IPL auction 2022: ఫిబ్రవరి 12-13 తేదీల్లో బెంగళూరులో జరుగుతున్న IPL మెగా వేలంలో, అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్‌ను విజేతగా నిలిపిన ఆటగాళ్లు కూడా వేలం వేయబడతారు. బీసీసీఐ నిబంధనల కారణంగా కొంతమంది ఆటగాళ్లు ఈ వేలంలో భాగం కావట్లేదు. అయితే కెప్టెన్ యశ్ ధుల్‌తో సహా మిగిలిన కొందరు ఆటగాళ్లను వేలంలో చేర్చనున్నారు. నలుగురు అండర్ 19 ఆటగాళ్ల కోసం మాత్రం ఐపీఎల్ ఫ్రాంచైజీలు బాగా డబ్బు ఖర్చు చేయవచ్చు.

1. యష్ ధుల్: అండర్-19 ప్రపంచ కప్ విజేత జట్టు కెప్టెన్ యష్ ధుల్, కరోనా కారణంగా టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లను ఆడలేకపోయాడు. కానీ ఇప్పటికీ 4 మ్యాచ్‌ల్లో, ఈ ఆటగాడు 76 సగటుతో 229 పరుగులు చేశాడు. టోర్నీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి హీరో అయ్యాడు. ఈ భారీ మ్యాచ్‌లో 110 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ కెప్టెన్‌ సారథ్యంలో భారత జట్టు ప్రపంచకప్‌ విజయం సాధించింది. అటువంటి పరిస్థితిలో, IPL ఫ్రాంచైజీలు ఈ ఆటగాడి కోసం పోటీ పడే అవకాశం కనిపిస్తుంది.

2. రాజ్ భవ: భారతదేశానికి అండర్-19 ప్రపంచ కప్‌లో ఆల్ రౌండర్ రాజ్ అంగద్ బావా. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఎనిమిదో ఆటగాడిగా ఉన్నాడు. బౌలింగ్‌లో భారతదేశం తరపున మూడవ అత్యంత విజయవంతమైన బౌలర్. రాజ్ భవ టోర్నీలో 63 సగటుతో 252 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 100కి పైగానే ఉంది. అతను టోర్నీలో 16.66 బౌలింగ్ సగటుతో 9 వికెట్లు తీశాడు. ఈ ఆటగాడు భారత్ ఆడిన 6 మ్యాచ్‌లలో 2 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌లు సాధించాడు. ఈ ఆల్‌రౌండర్‌ కోసం జట్లు పోటీ పడొచ్చు.

3. విక్కీ ఓస్త్వాల్: అండర్-19 ప్రపంచకప్ విక్కీ ఓస్త్వాల్ రూపంలో భారత్‌కు మరో అద్భుతమైన స్పిన్నర్‌ను అందించింది. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా విక్కీ నిలిచాడు. అతను టోర్నీలో 13 బౌలింగ్ సగటుతో 12 వికెట్లు తీశాడు. కేవలం 3.63 ఎకానమీతో పరుగులు ఇవ్వగా.. ఐపీఎల్‌లో కూడా స్పిన్‌తో అద్భుత ప్రదర్శన చేయగలడు.

4. రాజ్‌వర్ధన్ హంగర్గేకర్: అండర్-19 ప్రపంచకప్‌లో ఆల్ రౌండర్ రాజవర్ధన్ హంగర్గేకర్ కూడా తన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐర్లాండ్‌పై ఈ ఆటగాడు 17 బంతుల్లో 39 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుసగా 3 సిక్సర్లు బాదాడు. అండర్-19 ప్రపంచకప్‌లో, ఈ ఆటగాడు 185 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. అంతేకాదు.. టోర్నీలో 5 వికెట్లు కూడా తీశాడు.

వేలంలో భాగమైన అండర్-19 ఆటగాళ్లు వీరే:
BCCI నిబంధనల కారణంగా అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులోని ఏడుగురు బలమైన ఆటగాళ్లు IPLలో భాగం కాలేకపోతున్నారు. వారిలో షేక్ రషీద్, దినేష్ బానా, రవి కుమార్, నిశాంత్ సింధు, గర్వ్ సంగ్వాన్ మరియు అంగ్క్రిష్ రఘువంశీ ఉన్నారు. BCCI నిబంధనల ప్రకారం, IPL వేలం కోసం నమోదు చేసుకునే ముందు అండర్-19 ఆటగాడు కనీసం ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లేదా లిస్ట్-A మ్యాచ్ ఆడి ఉండాలి. అటువంటి పరిస్థితిలో, ఈ ఆటగాళ్లకు ఈసారి వేలంలో అవకాశం లభించట్లేదు.

ట్రెండింగ్ వార్తలు