Virat Kohli: ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటనకు బయల్దేరిన టీమిండియా కసరత్తులు ముమ్మరం చేసింది. ఈ మేరకు సిడ్నీ వేదికగా మొదలుకానున్న తొలి వన్డేపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చివరిసారి ఆస్ట్రేలియా గడ్డపై వన్డే ఆడిన టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది ఆతిథ్య జట్టు. 2018-19కి గానూ జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వన్డే సిరీస్ ను 2-1తేడాతో గెలిచిన ఇండియా, టీ 20ను సమంగా ముగించింది.
తొలిసారి ఏ ఒక్క ఫార్మాట్ కూడా ఓడిపోకుండా టీమిండియా తిరుగు ప్రయాణమైంది. ఇండియాకు మరో బలం విర3ట్ కోహ్లీ. తొలి టెస్టు తర్వాత అనుష్క ప్రసవం నాటికి ఇండియాకు తిరిగి వచ్చేయాలనుకుంటున్న కోహ్లీవైపే అందరి కళ్లు ఆశగా చూస్తున్నాయి. ఈ పర్యటన మొత్తంలో కోహ్లీ సత్తా మరోసారి చూపించడానికి ఏడు ఇన్నింగ్స్ ఉన్నాయి. ఈ గడ్డపై కోహ్లీకి ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ఫించ్ వ్యవహరిస్తున్నాడు.
ఇటీవల ఐపీఎల్ 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన ఫించ్.. కోహ్లీతో పాటు డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకున్నాడు. దీంతో మరోసారి విరాట్ సత్తా గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. కోహ్లీ బెస్ట్ వన్డే ప్లేయర్ ఆఫ్ ఆల్ టైం అని కాంప్లిమెంట్ ఇస్తున్నాడు.
https://10tv.in/legendary-footballer-diego-maradona-passes-away-at-the-age-of-60/
అతని రికార్డులు చూస్తే మనకు అద్వితీయంగా కనిపిస్తుంది. నిజంగా గుర్తుండిపోవాల్సిన విషయం. ఇది మైండ్ లో ఉంచుకుని అతణ్ని వీలైనంత త్వరగా బయటకు పంపేయాలనే ప్రయత్నిస్తాం. అతను ఆల్ టైం బెస్ట్ వన్డే ప్లేయర్ అయినా అతణ్ని అవుట్ చేసేందుకు మా దగ్గర కావాల్సిన ట్రిక్స్ ఉన్నాయి.
ఆసీస్ ఆల్ రౌండర్లు మార్కస్ స్టోనిస్, మిచెల్ మార్ష్ లతో ఫించ్ ధీమాగా కనిపిస్తున్నాడు.