India Vs Australia T20 Match : రింకూ సింగ్ లాస్ట్ బాల్ లో కొట్టిన సిక్స్ ఎందుకు స్కోర్ బోర్డులోకి రాలేదు.. అసలు విషయం ఏమిటంటే?

చివరి ఓవర్లో ఒక్క బాల్ మిగిలిఉండగా ఆస్ట్రేలి స్కోర్ 208తో భారత్ స్కోర్ 208 సమం అయింది. భారత్ జట్టు విజయానికి ఒక్క బాల్ కు ఒక్క పరుగు అవసరం.

India Vs Australia 1st T20 Match : భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య విశాఖపట్టణం వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచులో భార‌త జ‌ట్టు విజయం సాధించింది. 209 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని భార‌త్ 19.5 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. భార‌త బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ (80; 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), ఇషాన్ కిష‌న్ (58; 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. య‌శ‌స్వి జైస్వాల్ (21; 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రింకూ సింగ్‌(22 నాటౌట్‌) రాణించారు. ఈ మ్యాచ్ లో రింకు సింగ్ లాస్ట్ బాల్ లో సిక్స్ కొట్టాడు. అయితే, రింకు కొట్టిన లాస్ట్ సిక్స్ స్కోర్ బోర్డులో పరిగణలోకి తీసుకోలేదు.

Also Read : Ashwin : ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ గురించి సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించిన అశ్విన్‌.. ఆస్ట్రేలియా టాస్ ప్లాన్..

వరల్డ్ కప్ టోర్నీ తరువాత ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొదటి టీ20 మ్యాచ్ విశాఖలో జరిగింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఆరు బంతుల్లో భారత్ కు ఏడు పరుగులు అవసరం ఉంది. తొలి బంతికి రింకూ సింగ్ ఫోర్ కొట్టాడు. దీంతో అయిదు బంతుల్లో మూడు పరుగులు అవసరం ఉంది. రెండో బంతికి సింగిల్ వచ్చింది. మూడో బంతికి అక్షర్, నాల్గో బంతికి బిష్ణోమ్ రనౌట్ అయ్యారు. అయిదో బంతికి రెండో పరుగు తీసే క్రమంలో అర్ష్ దీప్ రనౌట్ అయ్యాడు. దీంతో ఒక్క బాల్ మిగిలిఉండగా ఆస్ట్రేలి స్కోర్ 208తో భారత్ స్కోర్ 208 సమం అయింది. భారత్ జట్టు విజయం సాధించాలంటే ఒక్క బాల్ కు ఒక్క పరుగు అవసరం. లాస్ట్ బాల్ రింకూ సింగ్ సిక్స్ కొట్టాడు. టీమిండియా విజేతగా నిలిచింది.

అయితే, రింకూ సింగ్ కొట్టి సిక్స్ పరిగణలోకి రాలేదు. ఆస్ట్రేలియా బౌలర్ లాస్ట్ బాల్ నో బాల్ వేశాడు. భారత్ కు అవసరమైన ఒక్క పరుగు నో బాల్ తోనే వచ్చింది. నో బాల్ తో టీమిండియా విజయం సాధించడంతో రింకూ సింగ్ కొట్టిన సిక్స్ ను స్కోర్ బోర్డులోకి పరిగణలోకి తీసుకోలేదు. ఒకవేళ ఆ సిక్స్ లెక్కించి ఉంటే భారత్ స్కోర్ 215 అయ్యేది. రింకూ కొట్టిన సిక్స్ తన వ్యక్తిగత స్కోర్ లోకి కూడా పరిగణలోకి రాలేదు.

Also Read : IND vs AUS 1st T20 : దంచికొట్టిన సూర్య‌కుమార్‌, ఇషాన్ కిష‌న్‌.. తొలి టీ20లో ఆస్ట్రేలియా పై భార‌త్ విజ‌యం

 

 

ట్రెండింగ్ వార్తలు