WTC Final: కివీస్ ఆలౌట్, 32పరుగుల ఆధిక్యం

వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఐదో రోజు మ్యాచ్‌లో కివీస్ 249పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 101/2పరుగులతో ఆరంభించిన న్యూజిలాండ్ 32 పరుగుల ఆధిక్యం సాధించింది.

Kiwis All Out

WTC Final: వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఐదో రోజు మ్యాచ్‌లో కివీస్ 249పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 101/2పరుగులతో ఆరంభించిన న్యూజిలాండ్ 32 పరుగుల ఆధిక్యం సాధించింది. మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు పట్టు బిగించారు. 135 పరుగులకే న్యూజిలాండ్‌ సగం వికెట్లను పడగొట్టారు. విలియమ్సన్‌(49)తో పార్టనర్ షిప్ అందిస్తున్న రాస్ టేలర్(11) అవుట్ అవడంతో వికెట్ల పతనం ఆరంభమైంది.

జామీసన్.. సౌతీలు కలిసి 51పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇలా విదేశీ టెయిలెండర్లను ఫినిష్ చేయడంలో టీమిండియా మరోసారి విఫలమైంది. ఒక ఎండ్ లో విలియమ్సన్ పట్టుదలతో క్రీజులో పాతుకుపోయినా.. 221 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ గా వెనుదిరిగాడు. మొహమ్మద్ షమీకి 4 వికెట్లు దక్కగా, ఇషాంత్ శర్మకు మూడు, రవిచంద్రన్ అశ్విన్ 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.