Rohit Sharma : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మను ఊరిస్తున్న భారీ రికార్డులు ఇవే..
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మను (Rohit Sharma) పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- November 3, 2026 / 08:28 AM IST
India vs New Zealand ODI Series Rohit Sharma eye on these Massive Milestones
Rohit Sharma : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డేకు ఆక్లాండ్ వేదిక కానుంది. కాగా.. ఈ వన్డే సిరీస్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో పరుగుల వరద పారించిన హిట్‌మ్యాన్.. కివీస్‌తో సిరీస్‌లోనూ తన ఫామ్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు.
న్యూజిలాండ్ గడ్డపై రోహిత్ శర్మ ఇప్పటి వరకు 14 వన్డేలు ఆడాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 36.41 సగటుతో 437 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు అర్థశతకాలు ఉన్నాయి. కాగా.. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ అందుకునే అవకాశం ఉన్న రికార్డులు ఇవే..
వన్డేల్లో 400 సిక్సర్లు..
2007లో రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు అతడు 291 మ్యాచ్‌లు ఆడాడు. 283 ఇన్నింగ్స్‌ల్లో 49.3 సగటుతో 12120 పరుగులు సాధించాడు. ఇందులో 35 శతకాలు, 63 అర్థశతకాలు ఉన్నాయి. 1148 ఫోర్లు, 381 సిక్సర్లు బాదాడు. అతడు మరో 19 సిక్సర్లు కొడితే.. వన్డేల్లో 400 సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. అంతేకాదండోయ్.. 7 సిక్సర్లు బాదితే అంతర్జాతీయ క్రికెట్లో 700 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు.
అంతర్జాతీయ క్రికెట్లో 21000 రన్స్..
రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 21,000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 348 పరుగుల దూరంలో ఉన్నాడు. అతను 517 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 550 ఇన్నింగ్స్‌లలో 42.66 సగటుతో 20,652 పరుగులు చేశాడు. ఇందులో 52 సెంచరీలు, 113 హాఫ్ సెంచరీలు ఉన్నాయి, అతని అత్యుత్తమ స్కోరు 264.
సెనా దేశాలన్నింటిలో వన్డే సెంచరీలు సాధించిన 4వ భారతీయుడు..
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ ఒక్క సెంచరీ చేస్తే.. సెనా దేశాలు (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అన్నింటిలో వన్డేలలో సెంచరీలు సాధించిన నాలుగో భారత ఆటగాడిగా నిలుస్తాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
సెనా దేశాల్లో 5000 పరుగులు సాధించిన తొలి ఓపెనర్..
సెనా దేశాల్లో 5 వేల అంతర్జాతీయ పరుగులు సాధించిన తొలి భారత ఓపెనర్‌గా నిలిచేందుకు రోహిత్ శర్మ కేవలం 36 పరుగుల దూరంలో ఉన్న ఉన్నాడు. 114 మ్యాచ్‌ల్లో 123 ఇన్నింగ్స్‌లలో 44.32 సగటుతో 4,964 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
