Asia Cup 2023: భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. అయినా మ్యాచ్ జరుగుతుందా..? ఎలా అంటే

ఆసియా కప్ 2023 టోర్నీలో దాయాది జట్లు పాక్, భారత్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే, గ్రూప్ స్టేజ్ లో వర్షం కారణంగా పూర్తిస్థాయి మ్యాచ్ జరగకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.

Asia Cup 2023

Asia Cup 2023: ఆసియా కప్ – 2023 టోర్నీలో భాగంగా సూపర్ -4లో ఆదివారం సాయంత్రం భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ జరుగుతుందా? జరగదా అనే విషయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం కురుస్తుందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పారు. ఆసియా కప్‌లో భాగంగా ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సూపర్ 4లోనూ దాయాది జట్ల మధ్య వర్షం కారణంగా మ్యాచ్ రద్దవుతుందా? అనే ఆందోళనలో ఇరుదేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు.

Asia Cup 2023 : మ్యాచ్ మ‌ధ్య‌లో ఆగిన ఫ్ల‌డ్ లైట్లు.. టోర్నీ మొత్తం చీక‌ట్లోనే ఆడించేవాళ్లా..?

వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. పాకిస్థాన్ వర్సెస్ భారత్ మ్యాచ్ జరిగే కొలంబోలో మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు వర్షం పడే అవకాశాలు 49శాతం నుంచి 66శాతం వరకు ఉన్నాయి. రాత్రి 7గంటల తరువాత 69శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. వర్షం రాకుంటే మ్యాచ్ కు ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతుంది. ఒకవేళ మ్యాచ్ జరిగే అవకాశంలేనంతగా వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదని ఐసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) పేర్కొంది.

Asia Cup 2023 : టీమ్ఇండియాపై వ‌రుణుడికి ఎంత ప్రేమో..! రావ‌ద్ద‌న్నా వ‌స్తున్నాడుగా..? నేపాల్‌తో మ్యాచ్ కూడా..

ఆసియా కప్ 2023 టోర్నీలో దాయాది జట్లు పాక్, భారత్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే, గ్రూప్ స్టేజ్ లో వర్షం కారణంగా పూర్తిస్థాయి మ్యాచ్ జరగకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. సూపర్ 4 స్టేజ్ లో వర్షం వచ్చినా మ్యాచ్ నిర్వహించేలా ఐసీసీ ఏర్పాట్లు చేసింది. ఆదివారం వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా.. సోమవారం మ్యాచ్ నిర్వహించేందుకు రిజర్వ్ డేని ఐసీసీ ప్రకటించింది. దీంతో మైదానంకు వచ్చేందుకు టికెట్లు తీసుకున్న వారు.. టికెట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని, సోమవారం మ్యాచ్ సందర్భంగా అవి చెల్లుబాటు అవుతాయని ఐసీసీ ఓ పేర్కొంది.