India Vs SA : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్.. హర్షల్ పటేల్ దూరం..!
India Vs SA : దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందే టీమిండియాకు షాక్ తగలనుంది. టీమిండియా పేసర్ హర్షల్ పటేల్ (Harshal Patel) దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరం కానున్నాడు.
- Sreehari A
- Published On : May 20, 2022 / 08:20 PM IST
India Vs Sa Injury Crisis Deepens For Team India, Harshal Patel Likely To Miss South Africa Series With Injury (1)
India Vs SA : దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందే టీమిండియాకు షాక్ తగలనుంది. టీమిండియా పేసర్ హర్షల్ పటేల్ (Harshal Patel) దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరం కానున్నాడు. గాయం కారణంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్- 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ చేతికి గాయమైంది. ఈ మ్యాచ్‌లో సింగిల్ ఓవర్‌కే హర్షల్ పటేల్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే.. ఇప్పటివరకూ సౌతాఫ్రికాతో సిరీస్ ఆడబోయే భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. మే 25న బీసీసీఐ అధికారికంగా భారత జట్టును ప్రకటించనుంది.
India Vs Sa Injury Crisis Deepens For Team India, Harshal Patel Likely To Miss South Africa Series With Injury
ఈ నేపథ్యంలో భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. పలువురు ఆటగాళ్లు వరుసగా గాయాల బారినపడుతున్నారు. ఇదివరకే భారత పేసర్ దీపక్ చాహర్ గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ కూడా ఆడేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇతర భారత ఆటగాళ్లలో జడేజా, సూర్యకుమార్ యాదవ్ టోర్నీ మధ్యలోనే నిష్ర్కమించారు. సౌతాఫ్రికాతో సిరీస్‌కు ముగ్గురు ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా లేదా అనేది సందిగ్ధం నెలకొంది. ఈ సిరీస్‌లో ఫస్ట్ టీ20 మ్యాచ్ జూన్ 9న ఢిల్లీ వేదికగా జరుగనుంది.
Read Also : IPL 2022 Final : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కీలక మార్పులు
