IND vs SL 2nd Test : ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో టెస్ట్ మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్.. కుల్దీప్ ఔట్.. సారాంశ్ ఎంట్రీ
IND vs SL 2nd Test : ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండో టెస్టు కొలంబో వేదికగా ఆదివారం ప్రారంభమైంది.
- Harish Thanniru
- Updated on- August 23, 2026 / 10:10 AM IST
India vs Sri Lanka 2nd Test Match
IND vs SL 2nd Test : ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండో టెస్టు కొలంబో వేదికగా ఆదివారం ప్రారంభమైంది. ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించిన భారత్ జట్టు.. రెండో టెస్టులోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. రెండో టెస్టులో భాగంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.
టాస్ సమయంలో గిల్ మాట్లాడుతూ.. మొదటి రెండుమూడు రోజులు బ్యాటింగ్ కు ఇక్కడి పిచ్ అనుకూలిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. తుది జట్టులో స్వల్ప మార్పులు చేసినట్లు తెలిపాడు. ఈ మ్యాచ్‌కు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ అందుబాటులో లేడని, కొంత అనారోగ్యంతో అతను జట్టుకు దూమయ్యాడని గిల్ తెలిపాడు. కుల్దీప్ స్థానంలో 33ఏళ్ల సారాంశ్ జైన్ తుది జట్టులోకి వచ్చాడు. అతడికి సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా క్యాప్ ను అందించాడు. మరోవైపు శ్రీలకం జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. కమిల్ మిశ్రా అరంగ్రేటం చేస్తుండగా.. చండిమాల్ స్థానంలో పసిందు సూరియబండారా తుది జట్టులోకి వచ్చాడు.
భారత్ తుది జట్టు : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, సారాంశ్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
శ్రీలంక తుది జట్టు : లాహిరు ఉదారా, కమిల్ మిషారా, పసిందు సూరియబండారా, కమిందు మెండిస్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), సోనాల్ దినుష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), కేశర నువాంత, ప్రభాత్ జయసూర్య, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో
A look at #TeamIndia‘s Playing XI for the 2nd #SLvIND Test 👌👌
Saransh Jain makes his international debut 👏👏
Updates ▶️ https://t.co/r9FgXSdsMf pic.twitter.com/WOCtWZ9YcP
— BCCI (@BCCI) August 23, 2026
The feeling of making your Test Debut ✨#TeamIndia all-rounder Ravindra Jadeja presents the Test cap to Saransh Jain 👏👏
Updates ▶️ https://t.co/r9FgXSdsMf#SLvIND pic.twitter.com/6H6KrUdSkU
— BCCI (@BCCI) August 23, 2026
