AUS vs BAN : బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఆస్ట్రేలియా.. మిచెల్ స్టార్క్ దెబ్బకు బెంబేలెత్తిపోయిన బ్యాటర్లు
AUS vs BAN : ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ జట్టుకు ఆసీస్ దిమ్మతిరిగే షాకిచ్చింది.
aus vs ban 2nd test
AUS vs BAN : ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ శనివారం ప్రారంభమైంది. అయితే, తొలి టెస్టు మ్యాచ్ లో ఆసీస్ జట్టును బంగ్లాదేశ్ జట్టు ఓడించింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు రెండో టస్టులో మొదటిరోజు ఆటలోనే విజృంభించారు. బంగ్లాదేశ్ జట్టును తొలి ఇన్నింగ్స్ లో 64 పరుగులకే కుప్పకూల్చారు.
Also Read : Lionel Messi jersey : మెస్సీ జెర్సీకి దిమ్మతిరిగే ధర.. రొనాల్డో షర్ట్ కంటే ఏకంగా ఆరు రెట్లు ఎక్కువ!
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బంగ్లాదేశ్ బ్యాటింగ్‌ను చెల్లాచెదురు చేశాడు. కేవలం 12 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ లో తొలి బంతికే వికెట్ తీసిన స్టార్క్.. నాలుగో ఓవర్ పూర్తయ్యేలోపు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. మరోవైపు.. కమిన్స్ సైతం విజృంభించి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆరు వికెట్లు తీసిన స్టార్క్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో టాప్-10లోకి ప్రవేశించాడు. 107 టెస్టుల్లో 441 వికెట్లు తీసిన స్టార్క్.. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ బౌలర్ డేల్ స్టెయిన్ (440 వికెట్లు)ను అధిగమించాడు.
మిచెల్ స్టార్క్ బౌలింగ్ దాటికి బంగ్లా బ్యాటర్లు వెంటవెంటనే ఔట్ అయ్యారు. ఈ క్రమంలో కనీసం 30 పరుగులైనా చేస్తుందా? లేదా? అనే పరిస్థితుల్లో ఉన్న బంగ్లాదేశ్ జట్టును మెహిదీ – హసన్, షోరిపుల్ – తౌజుల్ భాగస్వామ్యాలు కాపాడాయి. మెహిదీ – హసన్ కలిసి ఏడో వికెట్‌కు తొమ్మిది ఓవర్లలో 15 పరుగులు జోడించారు. చివరిలో షోరిఫుల్, తౌజుల్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ ఐదు ఫోర్లు కొట్టడంతో బంగ్లా స్కోరు 64 పరుగులకు చేరుకుంది.
డార్విన్‌లో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. ఆస్ట్రేలియాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి.. ఆ దేశ గడ్డపై తొలిసారి టెస్ట్ మ్యాచ్ విజయం నమోదు చేసింది. దీంతో రెండో టెస్టులో ఆస్ట్రేలియా తీవ్ర ఒత్తిడితో బరిలోకి దిగింది. అయితే, తొలి ఇన్నింగ్స్ లోనే బంగ్లాదేశ్ బ్యాటర్లను ఆసీస్ స్టార్ బౌలర్లు మిచెల్ స్టార్క్, కమిన్స్‌లు బెంబేలెత్తించారు. 64 పరుగులకే ఆలౌట్ చేశారు.
🚨 AUSTRALIA vs BANGLADESH SECOND TEST MATCH!!
Bangladesh 1st inning: 64 all out
– 6 Wickets for Mitchell Starc
– 3 Wickets for Pat Cummins
– 1 Wickets Josh Hazlewood
pic.twitter.com/6e7owsoPJS— Talha Nawaz (@TalhaDigital007) August 22, 2026
