India Vs West Indies
India Vs West Indies : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. పది నెలల సుదీర్ఘ విరామం తరువాత సొంతగడ్డపై టీమిండియా టెస్టు మ్యాచ్ ఆడుతుంది. అయితే, ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన టీమిండియా.. తొలుత బౌలింగ్ చేయనుంది. ఇద్దరు ప్రధాన ఫాస్ట్ బౌలర్లతోపాటు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగుతుంది.
భారత్ – వెస్టిండీస్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా ప్లేయింగ్ 11లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కింది. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో భారత జట్టు బరిలోకి దిగింది. అక్షర్ పటేల్, దేవదత్ పడిక్కల్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు.
టీమ్‌ఇండియా తుది జట్టు:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్‌కుమార్ రెడ్డి, కుల్‌దీప్‌యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
వెస్టిండీస్ తుది జట్టు:
త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్, జాన్ క్యాంప్‌బెల్, అలిక్ అథనేజ్, బ్రెండన్ కింగ్, షై హోప్ (వికెట్ కీపర్), రోస్టన్ చేజ్ (కెప్టెన్), జస్టిన్ గ్రీవ్స్, జొమెల్ వారికన్, ఖేరీ పియెరీ, జాన్ లైన్, జైడెన్ సీల్స్
INDIA’S PLAYING XI:
– Jaiswal, KL, Sudharsan, Gill (C), Jurel (WK), Jadeja, Sundar, Nitish, Kuldeep, Bumrah and Siraj. pic.twitter.com/rpgNJPFYzy
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 2, 2025
TEAM DURING NATIONAL ANTHEM TIME. 🇮🇳 pic.twitter.com/ofj2TND9EY
— Johns. (@CricCrazyJohns) October 2, 2025
వెస్టిండీస్‌తో భారత జట్టు మొత్తం 100 టెస్టులు ఆడింది. ఇందులో 23 టెస్టుల్లో విజయం సాధించగా.. 30 టెస్టుల్లో ఓడిపోయింది. 47టెస్టులు డ్రా అయ్యాయి.
భారత జట్టు సొంతగడ్డపై వెస్టిండీస్ జట్టుతో 47 టెస్టులు ఆడింది. ఇందులో 13 విజయాలు సాధించగా.. 14 మ్యాచ్ లలో ఓడిపోయింది. 20 టెస్టులు డ్రా అయ్యాయి.