Rohit sharma
T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో భారత్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, షమీ ఉన్నారు.
క్రీజులోకి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వచ్చారు.ఇటీవల మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. నెదర్లాండ్స్ చిన్నజట్టు కావడంతో మొదట బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. భారీ స్కోరు చేయాలని భావిస్తోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో కాస్త ఆలస్యంగా టాస్ వేశారు.