India Women vs England Women: మిథాలీ లేకుండానే ఇంగ్లాండ్‌తో మహిళల టీ20

ఇండియన్ మహిళా క్రికెట్ టీం.. అంతర్జాతీయ టీ20 సిరీస్ ఆడేందుకు రెడీ అయింది. శుక్రవారం ఇంగ్లాండ్ లోని కంట్రీ గ్రౌండ్ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో తలపడనుంది. కొవిడ్-19, గాయాలను దాటి వచ్చిన హర్మన్ టీంకు లీడ్ గా వ్యవహరించనుంది.

India Women

India Women vs England Women: ఇండియన్ మహిళా క్రికెట్ టీం.. అంతర్జాతీయ టీ20 సిరీస్ ఆడేందుకు రెడీ అయింది. శుక్రవారం ఇంగ్లాండ్ లోని కంట్రీ గ్రౌండ్ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో తలపడనుంది. కొవిడ్-19, గాయాలను దాటి వచ్చిన హర్మన్ టీంకు లీడ్ గా వ్యవహరించనుంది. టెస్టు, వన్డే ఫార్మాట్ కెప్టెన్ మిథాలీ రాజ్ మ్యాచ్ కు అందుబాటులో లేరు.

వన్డే సిరీస్ మూడు మ్యాచ్ లలోనూ మూడు హాఫ్ సెంచరీలకు మించిన స్కోరు నమోదు చేశారు. మిథాలీ మ్యాచ్ లో లేకపోవడంతో షఫాలీ వర్మ, స్మృతీ మంధాన, హర్మన్ ప్రీత్ లు ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి చూపించాల్సిన పరిస్థితి.

ఇండియా ఇప్పటి వరకూ ఇంగ్లాండ్ జట్టుతో 19 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడగా కేవలం 4మాత్రమే గెలిచి 15మ్యాచ్ లను ఓడిపోయింది. కొవిడ్-19తో పాటు గాయాల కారణంగా ప్రాక్టీస్ చేయలేకపోయింది.

‘ప్రతి రోజూ కఠినంగా శ్రమించి, శిక్షణ తీసుకునేవారిలో నేనొకర్ని. కొవిడ్-19, గాయాల కారణంగా ప్రిపేర్ అవడానికి టైం దొరకలేదు. అది సాకుగా చెప్పడం లేదు. ఎందుకంటే గ్రౌండ్ లో ప్రిపేర్ అవడానికి ఎక్కువ టైం తీసుకోవడానికి ఇష్టపడతాను. అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ అంటే.. అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. ఐదు ఇన్నింగ్స్ ల తర్వాత ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుస్తుంది. అలా నా వైపు నుంచి డిఫరెంట్ అప్రోచ్ మొదలుపెడతా’ అని హర్మన్‌ప్రీత్ అన్నారు.