గెలిచాం: కివీస్‌కు సెగలు పుట్టించిన శ్రేయాస్

పర్యటనలో తొలి గెలుపు.. టీ20 స్పెషలిస్టు శ్రేయాస్ అయ్యర్ అంచనాలు వదిలేసుకున్న మ్యాచ్‌ను విజేతగా నిలిపాడు. కివీస్ ఆశలపై నీళ్లు చల్లి 19ఓవర్లకు మ్యాచ్ ముగించాడు. 204పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ(7) ఆరంభంలోనే 
రెండు ఓవర్లకే వెనుదిరగడంతో వన్ డౌన్‌లో వచ్చిన కోహ్లీ(45; 32బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సు)తో కేఎల్ రాహుల్(56; 27బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సులు)తో కలిసి స్కోరు బోర్డు పరుగులుపెట్టించారు. 

స్వల్ప విరామాలతో రాహుల్.. కోహ్లీలు అవుట్ అవడంతో బరిలోకి దిగిన శ్రేయాస్ అయ్యర్(58; 29బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సులు)తో శివమ్ దూబ్(13), మనీశ్ పాండే(14)లతో భారత్ ను గెలిపించాడు. మిచెల్ శాంతర్, బ్లెయిర్ టిక్నెర్ చెరో వికెట్ తీయగా ఇష్ సోదీ 2వికెట్లు పడగొట్టాడు. 

 

అంతకంటే ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ సొంతగడ్డపై భారత్ ముందు భారీ లక్ష్యం ఉంచింది న్యూజిలాండ్. కెప్టెన్ కేన్ విలియమ్సన్(51; 26బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సులు)తో మెరుపులు కురిపిస్తే రాస్ టేలర్(54; 27బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సులు)తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్ కొలీన్ మన్రో(59; 42బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు)తో శుభారంభాన్ని నమోదు చేయడంతో కివీస్ బలమైన ఇన్నింగ్స్ కనబరచింది. 

భారత బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, శివమ్ దూబె, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీయగలిగారు. ఓపెనర్ మార్టిన్ గఫ్తిల్(30), టిమ్ సీఫెర్ట్(1), మిచెల్ శాంతర్(2)పరుగులు మాత్రమే చేయగా కాలిన్ గ్రాండ్‌హోమ్(0)డకౌట్ గా వెనుదిరిగాడు. 
 భారత ఓపెనర్లు టీ20 స్పెషలిస్టులు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను ఆరంభించారు.