Asian Games 2023 : భారత ఈక్వెస్ట్రియన్ జట్టు (Indian equestrian team ) ఆసియా క్రీడల్లో (Asian Games) అద్భుతం చేసింది. 41 ఏళ్ల తరువాత గుర్రపు పందేల్లో స్వర్ణ పతకం సాధించింది. సుదీప్తి హజెలా, హృదయ్ విపుల్, అనూష్ గార్వాలా, దివ్యకృతి సింగ్‌లతో కూడిన భారత బృందం ఈక్వస్ట్రియన్‌లో డ్రస్సేజ్ ఈవెంట్‌లో 209.205 పాయింట్లతో అతిథ్య చైనాను వెనక్కి నెట్టి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్ విభాగంలో భారత్‌కు ఇది నాలుగో గోల్డ్ మెడల్. మిగిలిన మూడు పతకాలు 1982 ఆసియా క్రీడల్లో సాధించిన కావడం గమనార్హం.
అటు సెయిలింగ్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే నేహా ఠాకూర్ రజతం గెలవగా, మరో రెండు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల విభాగంలో ఎబాద్ అలీ ఆర్‌ఎస్ – X కేటగిరీలో, విష్ణు శరవణన్ ఐఎల్‌సీఏ విభాగంలో కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ప్రస్తుతం భారత పతకాల సంఖ్య 14కు చేరింది. ఇందులో 3 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్య పతకాలు ఉన్నాయి. 78 పతకాలతో అతిథ్య చైనా అగ్రస్థానంలో ఉండగా భారత్ ఆరో స్థానంలో కొనసాగుతోంది.
భారత బాక్సర్ సచిన్ రెండో రౌండ్‌లోకి ఎంటర్ అయ్యాడు. మంగళవారం జరిగిన 57 కేజీల విభాగంలో సచిన్ 5-0తో ఇండోనేషియాకు చెందిన అస్రి ఉదిన్ పై విజయం సాధించాడు. ఇంకోవైపు ఈస్పోర్ట్స్‌లో భారత ద్వయం అయాన్ బిస్వాస్, మయాంగ్ అగర్వాల్ స్ట్రీట్ ఫైటర్ నాకౌట్ రౌండ్ల నుంచి ఎలిమినేట్ అయ్యారు.
Victory lap by our gold medalists! Incredible performance today to win the ? ?? #Cheer4india#WeAreTeamIndia | #IndiaAtAG22 | #Equestrian pic.twitter.com/BSVXbGdVOg
— Team India (@WeAreTeamIndia) September 26, 2023