Nishad Kumar
Nishad Kumar : టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు రెండో సిల్వర్ మెడల్ దక్కింది. హైజంప్ ఈవెంట్ లో రెండో స్థానంలో నిలిచిన భారత అథ్లెట్ నిషద్ కుమార్ వెండి పతకం గెల్చుకున్నాడు. యూఎస్ఏకు చెందిన హైజంప్ పారాలింపియన్ టౌన్ సెండ్ రోడెరిక్ అత్యధిక ఎత్తు ఎగిరి గోల్డ్ మెడల్ ఎగరేసుకుపోయాడు.
నిషద్ కుమార్ … 2.06 మీటర్ల ఎత్తువరకు ఎగిరి సత్తా చాటుకున్నాడు. గోల్డ్ మెడల్ గెల్చుకున్న రోడెరిక్ 2.15 మీటర్లు హైజంప్ చేయడంతో.. మొదటి స్థానంలో నిలిచాడు. మరో అమెరికన్ వైజ్ డల్లాస్ కూడా…. 2.06 మీటర్లు హైజంప్ చేసినా.. డెసిమల్స్ తేడాలో మూడో స్థానంలో నిలిచాడు.
Nishad Kumar Wins Silver Medal In Paralympics
టోక్యో పారాలింపిక్స్ లో ఐదోరోజు మనోళ్లు సత్తా చాటుకున్నారు. టేబుల్ టెన్నిస్ పారాలింపియన్ భవీనా పటేల్ ఈ ఉదయం సిల్వర్ మెడల్ గెల్చుకుంది. వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ చేతిలో 3-0తేడాతో ఓడినా.. దేశ జెండా రెపరెపలాడించడంలో.. సక్సెస్ అయ్యారు.