×
Ad

IND vs USA : గంభీర్ సలహాతోనే గట్టెక్కాం.. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే.. కెప్టెన్ సూర్యకుమార్

Suryakumar Yadav : మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్య కుమార్ మాట్లాడుతూ.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన సలహాతోనే ఓటమి నుంచి గట్టెక్కామని చెప్పారు.

Suryakumar Yadav

  • టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో భారత్ విజయం
  • యూఎస్ఏపై 29 పరుగుల తేడాతో గెలుపు
  • గంభీర్ సలహాతోనే విజయం సాధ్యమైందన్న కెప్టెన్ సూర్య కుమార్

T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా శనివారం తన తొలి మ్యాచ్‌ను భారత జట్టు యూఎస్‌ఏతో ఆడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు విజయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక భూమిక పోషించారు.

Also Read : India vs USA : టీ20 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో భారత జట్టు విజయం.. ప్లేయర్ల విన్యాసాలు చూశారా.. ఫొటో గ్యాలరీ

టాస్‌ గెలిచిన యూఎస్‌ఏ తొలుత బౌలింగ్‌ తీసుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఆరంభం నుంచి వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. అమెరికా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో భారత బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఒకానొక దశలో 77 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. కానీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. 49 బంతుల్లో 84 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. చివర్లో సూర్యకుమార్ దూకుడైన ఆటతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంబించిన యూఎస్ఏ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత జట్టు 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.


మ్యాచ్ అనంతరం సూర్య కుమార్ మాట్లాడుతూ.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన సలహాతోనే ఓటమి నుంచి గట్టెక్కామని చెప్పారు. స్లో పిచ్ అని, చివరి వరకు బ్యాటింగ్ చేయాలని బ్రేక్ సమయంలో గంభీర్ సలహా ఇచ్చారని, ఆయన సూచనలతోనే తాను ఆఖరి వరకు క్రీజులో ఉండి బ్యాటింగ్ చేశానని సూర్య చెప్పుకొచ్చాడు. అతని సలహా జట్టు విజయానికి కలిసొచ్చిందని సూర్యకుమార్ యాదవ్ అభిప్రాయడ్డాడు.

నేనెంత ఒత్తిడి అనుభవించానో .. నేను మాత్రమే చెప్పగలను. నేను చివరి వరకు క్రీజులో ఉంటే పరిస్థితి వేరేలా మారుతుందని నా మీద నాకు నమ్మకముంది. పిచ్ కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంది. కానీ, ఎప్పుడు పరుగులు వేగంగా రాబట్టాలో మాకు తెలుసు అని సూర్య అన్నాడు.

ఈ పిచ్ మీద 180, 190 పరుగులు చేయలేమని ముందే అనిపించింది. 140 పరుగుల వికెట్ ఇది. 14ఓవర్ల తరువాత వచ్చిన బ్రేక్‌లో గౌతమ్ గంభీర్ నా వద్దకు వచ్చాడు. నాకు ఇదే విషయం చెప్పారు. చివరి వరకు బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించు. నువ్వు ఏ సమయంలోనైనా కవర్ చేయగలవు అని అన్నాడని, గంభీర్ సలహాను పాటించానని.. ఛివరికి జట్టు విజయంలో కీలక భూమిక పోషించానని సూర్యకుమార్ యాదవ్ అన్నారు.