Wriddhiman Saha : రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు.. న్యూజిలాండ్ పైనే ఆఖ‌రి మ్యాచ్..

టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు వృద్ధిమాన్ సాహా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.

Indian Veteran star Wriddhiman Saha announces retirement from all forms of cricket

Wriddhiman Saha retirement : టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు వృద్ధిమాన్ సాహా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ స‌హా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రంజీ సీజ‌నే త‌న‌కు చివ‌రిది అని చెప్పాడు.

‘క్రికెట్ కు వీడ్కోలు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ప్ర‌స్తుత రంజీ సీజ‌నే కెరీర్‌లో చివ‌రిది. బెంగాల్ త‌రుపున ఆఖ‌రి సారి ప్రాతినిధ్యం వ‌హించ‌డం సంతోషంగా ఉంది. ఈ సీజ‌న్‌ను గుర్తుండి పోయేలా చేసుకుంటా. ఇప్ప‌టి వ‌ర‌కు స‌హ‌క‌రించిన అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు.’ అని సాహా అన్నాడు.

Gautam Gambhir : శ్రీలంక‌, కివీస్‌ చేతుల్లో ఓడిన భార‌త్‌.. ఆసీస్ ప‌ర్య‌ట‌న గంభీర్‌కి అగ్నిప‌రీక్ష‌?

40 ఏళ్ల సాహా టీమ్ఇండియా త‌రుపున 40 టెస్టులు, 9 వ‌న్డేలు ఆడాడు. టెస్టుల్లో 1353 ప‌రుగులు, వ‌న్డేల్లో 41 ప‌రుగులు సాధించాడు. 2010లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అత‌డు చివ‌రి సారి 2021 న్యూజిలాండ్ పై వాంఖ‌డే వేదిక‌గా టెస్టు ను ఆడాడు. మ‌హేంద్ర సింగ్ ధోని, రిష‌బ్ పంత్‌ల త‌రువాత టెస్టుల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన వికెట్ కీప‌ర్‌గా సాహా (3) నిలిచాడు. ఇక ఐపీఎల్‌లో 170 మ్యాచులు ఆడిన సాహా ఓ సెంచ‌రీ, 13 అర్ధ‌శ‌త‌కాల సాయంలో 2934 ప‌రుగులు చేశాడు.

ఐపీఎల్‌లో ప్ర‌స్తుతం గుజ‌రాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. అయితే.. వ‌చ్చే సీజ‌న్‌కు ముందు సాహాను గుజ‌రాత్ మెగా వేలానికి విడిచిపెట్టింది. ప్ర‌స్తుతం ఆట‌కు వీడ్కోలు ప్ర‌క‌టించిన అత‌డు మెగావేలానికి త‌న పేరును న‌మోదు చేసుకోక‌పోవ‌చ్చు.

IND vs NZ : న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌.. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కామెంట్స్‌.. నాటౌట్ ఇచ్చుంటేనా..