Brett Lee: ఇండియాలో బ్రెట్ లీ కారును వెంబడించిన యువకులు.. వీడియో షేర్ చేసిన ఆసీస్ మాజీ క్రికెటర్..

కారులో వెళ్తుండగా ఇద్దరు అభిమానులు తనను స్కూటర్ పై ఫాలో అయిన వీడియోను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Brett Lee (Image courtesy_ Twitter)

Brett Lee: క్రికెట్‌పై అవగాహన ఉన్న ప్రతీఒక్కరికి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ సుపరిచితమే. తన అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను పెవిలియన్ బాటపట్టించడంలో బ్రెట్ లీ దిట్టగా పేరుపొందాడు. భారత్‌లో బ్రెట్ లీకి భారీగానే అభిమానులు ఉన్నారు. అతను అన్ని‌రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఐపీఎల్ 2023 జియో సినిమా యాప్‌లో ఇంగ్లీష్ వ్యాఖ్యాత ప్యానెల్‌లో ఉన్నారు. అయితే, ఇటీవల బ్రెట్ లీ ముంబై వీధుల్లో కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఇద్దరు యువకులు అతన్ని స్కూటర్ పై వెంబడించారు.

Harry Brook: నా ఫ్యామిలీ వెళ్లింది.. గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే ఉంది.. సెంచరీపై హ్యారీ బ్రూక్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ ఇటీవల భారత్‌కు వచ్చినప్పుడల్లా తనకు లభించే సాదర స్వాగతం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ముంబై వీధుల్లో తన కారును వెంబడించిన యువకుల వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు బ్రెట్ లీ. దీనికి క్యాప్షన్ గా.. భారతదేశం ఎప్పుడూ అద్భుతమైన ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది.. అభిరుచిని ప్రేమించండి #wearalid అబ్బాయిలు. అంటూ పేర్కొన్నాడు.

Harry Brook: సెంచ‌రీతో చెల‌రేగిన హ్యారీ బ్రూక్.. రూ.13 కోట్ల‌కు న్యాయం చేశాడు

బ్రెట్ లీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన వీడియోలో.. ఇద్దరు యువకులు బ్రెట్ లీ కారులో వెళ్తుండటాన్ని గుర్తించి స్కూటర్ పై కారును ఫాలో అయ్యారు. సార్ మేము మీకు పెద్ద అభిమానులం అని పదేపదే అరుస్తూ సెల్ఫీ దిగేందుకు అవకాశం ఇవ్వండి అంటూ పేర్కొన్నారు. కొద్దిదూరం పాటు బ్రెట్ లీ కారు వెంట వారు స్కూటర్ పై ఫాలో అయ్యారు. బ్రెట్ లీ మాత్రం.. ముందు మీరు హెల్మెంట్ లు ధరించండి.. ప్రశాంతంగా వాహనం నడపండి అంటూ సూచించడం వీడియోలో వినొచ్చు.

 

కారులో  వెళ్తుండగా ఇద్దరు అభిమానులు స్కూటర్‌పై ఫాలో అయిన వీడియోను బ్రెట్ లీ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో షేర్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వీడియో షేర్ చేసిన ఒక్కరోజులోనే 3.2లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 9వేలకుపైగా లైక్ లు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు. ‘హాహా వారికి బేసిక్స్ తెలియాలి.. బ్రెట్ లీకి ఎదురుగా మీరు ఎల్లప్పుడూ హెల్మెంట్ ధరించండి’ అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు.