Indonesia Open : ఇండోనేషియా ఓపెన్‌లో చ‌రిత్ర సృష్టించిన‌ సాత్విక్-చిరాగ్ జోడి

ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింట‌న్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్ (Satwiksairaj) – చిరాగ్ శెట్టీ(Chirag Shetty) జోడి చ‌రిత్ర సృష్టించింది.

Satwiksairaj Rankireddy - Chirag Shetty

Indonesia Open 2023: ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింట‌న్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్ (Satwiksairaj) – చిరాగ్ శెట్టీ(Chirag Shetty) జోడి చ‌రిత్ర సృష్టించింది. ఆదివారం జకార్తాలో జ‌రిగిన‌ పురుషుల డ‌బుల్స్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆరోన్‌ చియా–సో వుయ్‌ యిక్‌ (మలేసియా) జోడిని ఓడించి విజేత‌గా నిలిచింది. హోరీగా సాగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో 21-17, 21-18 తేడాతో విజ‌యం సాధించింది. ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నీలో విజేత‌గా నిలిచిన మొద‌టి భార‌త జోడిగా రికార్డు నెల‌కొల్పింది.

Indonesia Open : సాత్విక్‌-చిరాగ్ జోడీ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌.. ఫైన‌ల్స్‌కు

సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టీ జోడి ప్ర‌ద‌ర్శ‌న ఈ ఏడాది నిల‌కడ‌గా ఉంది. ఈ సీజ‌న్‌లో స్విస్ ఓపెన్‌, ఆసియా ఛాంపియ‌న్ షిప్‌లో విజేత‌లుగా నిలిచి స్వ‌ర్ణ ప‌త‌కాల‌ను అందుకోగా మలేసియా ఓపెన్‌లో సెమీస్‌లో ఓడింది. అయితే.. తాజాగా ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింట‌న్ టోర్నీలో స‌త్తా చాటి విజేత‌గా నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు