సిరీస్‌లోని ప్రతి మ్యాచ్‌లో మార్పులతో బరిలోకి దిగడం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అలవాటైన పనే. కానీ, భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియాతో తలపడిన రెండో వన్డేలో ఏ మాత్రం మార్పుల్లేకుండానే బరిలోకి దిగిన భారత్.. విజయాన్ని దక్కించుకుంది. ఆ మ్యాచ్‌లో ధావన్‌కు బదులు కేఎల్ రాహుల్‌ను రోహిత్‌తో పాటు ఓపెనర్‌గా తీసుకుంటారని భావించారంతా.. వారి ఊహలకు అందకుండా మార్పుల్లేని జట్టుతో నాగ్‌పూర్ వన్డేను విజయవంతంగా ముగించాడు కోహ్లీ.
మూడో వన్డేకు కూడా మార్పులేమీ లేకుండానే బరిలోకి దిగుతున్నాడా.. ధావన్ బదులు రాహుల్‌కు అవకాశమిస్తారా అనేది ఆలోచించాల్సిన విషయమే. రెండు వన్డేల్లోనూ ధావన్ పరవాలేదనిపించి 21 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా అసంతృప్తికర ఇన్నింగ్స్‌తో ముగించాడు. ఈ క్రమంలో రాహుల్‍ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని విశ్లేషకుల అంచనా.
మరోవైపు 2019 ఐసీసీ వరల్డ్ కప్‌కు ముందు వన్డే ఫార్మాట్‌లో రిషబ్ పంత్‌ను పరీక్షించాల్సి ఉంది. కానీ, వికెట్ కీపర్‌గా ధోనీ కచ్చితంగా ఆడాల్సిన రాంచీ మ్యాచ్‌లో పంత్‌కు చోటు దక్కదనే చెప్పాలి. ఈ మ్యాచ్ తర్వాత జరగనున్న 4, 5 వన్డేలలో పంత్ చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
ఆఖరి 3వన్డేల కోసమే జట్టులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్‌కు చోటు ఖాయం అనిపిస్తోంది. భువీని తీసుకుంటే మొహమ్మద్ షమీ బెంచ్‌కు పరిమితమవుతాడు. చాహల్ మరోసారి తుది జట్టులో చోటు దక్కించుకోకపోవచ్చు. 2వన్డేల్లోనూ నిరాశపర్చిన అంబటిరాయుడుకు ఉద్వాసన తప్పదు.
టీమిండియా(అంచనా):
కేఎల్ రాహల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, కేదర్ జాదవ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్
ప్రత్యక్ష ప్రసారం:
స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్
సమయం:
2019 మార్చి 8 శుక్రవారం మధ్యాహ్నం 1:30గంటలకు
వేదిక:
జార్ఖండ్‌లోని రాంచీ స్టేడియం