Morne Morkel : ఆసియాకప్‌లో భారత బౌలింగ్ కాంబినేషన్ పై మోర్కెల్ కీలక వ్యాఖ్యలు.. స్పిన్నర్లకు చోటు కష్టమే..!
ఆసియాకప్‌లో బౌలింగ్ కాంబినేషన్, విజయావకాశాలపై భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ (Morne Morkel) తన అభిప్రాయాలను వెల్లడించాడు.

Team India bowling coach Morne Morkel breaks silence on bowling combination for Asia Cup 2025
Morne Morkel : ఆసియాకప్ 2025 నేటి (సెప్టెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. యూఏఈ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగాటోర్నీలో భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో బరిలోకి దిగుతోంది. టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌ను ఆతిథ్య యూఏఈతో బుధవారం (సెప్టెంబర్ 10న) ఆడనుంది. ఈ క్రమంలో టోర్నమెంట్‌లో బౌలింగ్ కాంబినేషన్, విజయావకాశాలపై భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ (Morne Morkel) తన అభిప్రాయాలను వెల్లడించాడు.
సాధారణంగా యూఏఈ పిచ్ లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ సిన్నర్లు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే సెలక్టర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లకు జట్టులో చోటు ఇచ్చారు. ఈనేపథ్యంలో తొలి మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందా అనే ప్రశ్న మోర్కెల్‌కు ఎదురైంది.
Mohammed Siraj : ఒకే ఒక మ్యాచ్.. అయితేనేం.. ప్రతిష్టాత్మక అవార్డు రేసులో టీమ్ఇండియా పేసర్ సిరాజ్
ఛాంపియన్స్ ట్రోఫీలో పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలించాయి. అయితే.. ఈ సారి పిచ్‌లు అలా ఉండకపోవచ్చునని మోర్కెల్ అన్నాడు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నాడు. అయితే.. దీనిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు.
మ్యాచ్ రోజు పిచ్‌ను పరిశీలించిన తరువాత బౌలింగ్ కాంబినేషన్ పై ఓ అంచనా వస్తామన్నాడు. ప్రస్తుతం దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని పిచ్ పై ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ఉన్న దానికంటే ఎక్కువ గడ్డి ఉందన్నాడు.
తొలి మ్యాచ్‌లో యూఏఈతో తలపడడం పై మాట్లాడుతూ..
ఆసియాకప్‌లో భాగంగా టీమ్ఇండియా తొలి మ్యాచ్‌ను బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో తలపడనుంది. దీనిపై మోర్కెల్ మాట్లాడుతూ.. టోర్నమెంట్‌లో తాము ఏ జట్టును తేలికగా తీసుకోబోమని చెప్పుకొచ్చాడు. సవాల్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.
South Africa : ఇంగ్లాండ్ పై 342 పరుగుల తేడాతో ఘోర ఓటమి.. దక్షిణాఫ్రికాకు ఐసీసీ భారీ జరిమానా..
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ జట్ల మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో భారత్ తన చివరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 19న ఒమన్‌తో ఆడనుంది.