Mohammed Siraj : ఒకే ఒక మ్యాచ్.. అయితేనేం.. ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు రేసులో టీమ్ఇండియా పేస‌ర్ సిరాజ్‌

ఆగ‌స్టు నెల‌కు సంబంధించి ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు మ‌హ్మ‌ద్ సిరాజ్(Mohammed Siraj) నామినేట్ అయ్యాడు.

Mohammed Siraj : ఒకే ఒక మ్యాచ్.. అయితేనేం.. ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు రేసులో టీమ్ఇండియా పేస‌ర్ సిరాజ్‌

Mohammed Siraj Nominated For ICC Player Of The Month Award

Updated On : September 9, 2025 / 11:19 AM IST

Mohammed Siraj : ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో స‌మం చేయ‌డంలో టీమ్ఇండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ కీల‌క పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఓవ‌ల్ వేదిక‌గా జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్ ఆఖ‌రి రోజు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఈ క్ర‌మంలో అత‌డు ఆగ‌స్టు నెల‌కు సంబంధించి ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.

ఆగ‌స్టు నెల‌లో సిరాజ్ (Mohammed Siraj ) కేవ‌లం ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో అత‌డు అసాధార‌ణ ప్ర‌తిభ క‌న‌బ‌రిచాడు. 21.11 స‌గ‌టుతో 9 వికెట్లు తీశాడు అని ఐసీసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అత‌డితో పాటు న్యూజిలాండ్ పేస‌ర్ మ్యాట్ హెన్రీ, వెస్టిండీస్ పేస‌ర్ జెడ‌న్ సీల్స్‌ను ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.

South Africa : ఇంగ్లాండ్ పై 342 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మి.. ద‌క్షిణాఫ్రికాకు ఐసీసీ భారీ జ‌రిమానా..


ఐసీసీ ఓటింగ్‌ అకాడమీతో పాటు ఆన్‌లైన్‌లో ఫ్యాన్స్ వేసే ఓట్ల ఆధారంగా ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డు విజేతను ప్ర‌క‌టిస్తుంది అన్న సంగ‌తి తెలిసిందే.

దుమ్ములేపిన‌ హెన్రీ, జేడన్‌ సీల్స్‌..

జింబాబ్వేతో టెస్టు సిరీస్‌లో కివీస్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ అద‌ర‌గొట్టాడు. రెండు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు ప‌డ‌గొట్టాడు. జింబాబ్వేను కివీస్ 2-0 తేడాతో వైట్ వాష్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

Asia cup 2025 : నేటి నుంచే ఆసియాక‌ప్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌ల‌ను ఎక్క‌డ చూడొచ్చంటే..?

పాకిస్తాన్‌పై 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌ గెలవడంలో జేడన్‌ సీల్స్ కీల‌క పాత్ర పోషించాడు. ఆఖ‌రి వ‌న్డేలో ఏకంగా ఆరు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో 10 వికెట్లు తీశాడు. ఎకానీమ 4.10 మాత్ర‌మే.