IndVsZim 2nd ODI : రెండో వన్డేలోనూ జింబాబ్వేపై భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం

టీమిండియా జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. ఇంగ్లండ్‌, వెస్టిండీస్ టూర్ల‌లో రాణించిన భార‌త క్రికెట్ జ‌ట్టు.. తాజాగా జింబాబ్వే టూర్‌లోనూ స‌త్తా చాటింది.

IndVsZim 2nd ODI : రెండో వన్డేలోనూ జింబాబ్వేపై భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం

Updated On : August 20, 2022 / 7:34 PM IST

IndVsZim 2nd ODI : టీమిండియా జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. ఇంగ్లండ్‌, వెస్టిండీస్ టూర్ల‌లో రాణించిన భార‌త క్రికెట్ జ‌ట్టు.. తాజాగా జింబాబ్వే టూర్‌లోనూ స‌త్తా చాటింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3 మ్యాచుల వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. హ‌రారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక‌గా జరిగిన రెండో వ‌న్డేలో జింబాబ్వే నిర్దేశించిన టార్గెట్ ను భారత్ కేవ‌లం 25.4 ఓవ‌ర్ల‌లోనే చేధించి విక్టరీ కొట్టింది.

టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆతిథ్య జ‌ట్టు 38.1 ఓవ‌ర్ల‌లో 161 ప‌రుగులకే ఆలౌట్ అయ్యింది. 162 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. స‌గం ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని చేధించింది. భారత బ్యాటర్లలో శిఖ‌ర్ ధావ‌న్ (33), శుభ్‌మ‌న్ గిల్ (33), దీప‌క్ హుడా (25), వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్ (43) రాణించారు.

 

సిరీస్ భారత్ కైవసం..

కెప్టెన్ కేఎల్ రాహుల్ (1), ఇషాన్ కిషన్(6) విఫలం అయ్యారు. 25.4 ఓవర్లలో 5 వికెట్ల న‌ష్టానికి 167 ప‌రుగులు చేసి వ‌రుస‌గా రెండో విక్ట‌రీ నమోదు చేసింది భారత్. ఈ గెలుపుతో వన్డే సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, ప్రిసిద్ధ్ క్రిష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలో వికెట్ తీశారు.

 

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సంజూ..