PCB : బాబర్ ఆజామ్, రిజ్వాన్‌లకు పీసీబీ మరో షాక్.. మొన్న టీ20 జట్టు నుంచి తొలగిస్తే.. నేడు ఏకంగా..
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్‌లకు పీసీబీ (PCB) వరుస షాక్‌లు ఇస్తోంది. ఆసియా కప్ 2025కి ఎంపిక చేసిన..

PCB annual contracts Babar Azam And Mohammad Rizwan demoted
PCB : పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజామ్(Babar Azam), మహ్మద్ రిజ్వాన్‌ల(Mohammad Rizwan)కు పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) వరుస షాక్‌లు ఇస్తోంది. ఆసియా కప్ 2025కి ఎంపిక చేసిన జట్టులో ఈ ఇద్దరికి చోటు ఇవ్వలేని సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో వీరిద్దరికి డిమోషన్ లభించింది.
గత కొన్నాళ్లుగా ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు పీసీబీ (PCB) సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో ఏ గ్రేడ్‌లో ఉండగా.. తాజాగా ప్రకటించిన జాబితాలో బి కేటగిరికి పడిపోయారు. అయితే.. ఏ ఒక్క ఆటగాడికి కూడా పీసీబీ ఏ గ్రేడ్‌లో చోటు ఇవ్వకపోవడం గమనార్హం.
Asia Cup 2025 : భారత జట్టు ప్రకటన ఆలస్యం..! ఎందుకంటే..?
మొత్తం 30 మంది ఆటగాళ్లకు పీసీబీ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కింది. వీరిలో 12 మంది.. అహ్మద్ డానియాల్, ఫహీమ్ అష్రఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ హారీస్, మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ మీర్జా, సుఫ్యాన్ మొకిమ్‌లు కొత్త ప్లేయర్లు కావడం గమనార్హం.
2025 జూలై 1 నుంచి 2026 జూన్ 30 వరకు ఈ కాంట్రాక్టులు అమల్లో ఉండనున్నాయి.
పాకిస్తాన్ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ప్లేయర్లు వీరే..
బి కేటగిరి..
అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, మహ్మద్ రిజ్వాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది.
సి కేటగిరీ..
అబ్దుల్లా షఫీక్, ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, మహ్మద్ హరీస్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, నోమన్ అలీ, సాహిబ్జాదా ఫర్హాన్, సాజిద్ ఖాన్, సౌద్ షకీల్.
డి కేటగిరి..
అహ్మద్ డానియాల్, హుస్సేన్ తలత్, ఖుర్రం షాజాద్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, సల్మాన్ మీర్జా, షాన్ మసూద్, సుఫ్యాన్ మోకిమ్.