Delhi Capitals Jersey : ఐపీఎల్‌-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జెర్సీ ఇదేనట.. ఫొటో వైరల్..!

IPL 15 Season 2022 : ఐపీఎల్‌-2022 సీజన్‌ మార్చి 26 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ ఐపీఎల్ 15 సీజేన్ మే 29 వరకు కొనసాగనుంది.

Ipl 15 Season 2022 Rishabh Pant Led Delhi Capitals Unveil New Jersey For Upcoming Season

IPL 15 Season 2022 : ఐపీఎల్‌-2022 సీజన్‌ మార్చి 26 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ ఐపీఎల్ 15 సీజేన్ మే 29 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా లీగ్‌లో పాల్గొనే ఐపీఎల్ జట్లు తమ జెర్సీలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పలు జట్లు జెర్సీలను ప్రకటించగా.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తమ కొత్త జెర్సీని అధికారికంగా ప్రకటించింది. హోమ్ గ్రౌండ్ అయిన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ కొత్త జెర్సీని అభిమానుల సమక్షంలో ఆవిష్కరించింది ఢిల్లీ ప్రాంఛైజీ. ఢిల్లీ క్యాపిటల్స్ తమ సీజన్‌ను మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో బ్రబౌర్న్ స్టేడియంలో ప్రారంభించనుంది.

దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ (DC) శనివారం విడుదల చేసింది. ఈ జెర్సీ చూసేందుకు ఎరుపు, నీలంతో మిక్సింగ్ రంగులో కనిపిస్తోంది. ఇక జెర్సీపై పులి బొమ్మ ప్రధాన ఆకర్షణగా ఉంది. ఢిల్లీ జెర్సీపై ఐపీఎల్ ఫ్యాన్స్ నుంచి వరుసగా స్పందన వస్తోంది. ఢిల్లీ జెర్సీ లుక్ చూసి కొందరు సూపర్ అని అంటుంటే మరికొందరు కొత్త దాని కంటే పాత జెర్సీనే బెటర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఐపీఎల్ జట్టుగా ఢిల్లీ డేర్ డెవిల్స్ అని ఉండేది. కానీ, ఆ తర్వాత సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకుని ఐపీఎల్ టోర్నీలో పాల్గొంది ఈ ప్రాంఛైజీ.


గత సీజన్‌లో జట్టుకు భారత జట్టు వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఐపీఎల్‌-2021లో పంత్‌ సారథ్యంలోని ఢిల్లీ జట్టు అద్భుత విజయాలతో ఆకట్టుకుంది. ఆ టోర్నీలో ఫ్లే ఆఫ్ వరకు దూసుకెళ్లింది. కానీ, టైటిల్‌ వేటలో ఢిల్లీ చేతులేత్తేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం, నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియం, పూణేలోని MCA ఇంటర్నేషనల్ స్టేడియంలో మొత్తం నాలుగు వేదికల్లో ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ కొనసాగనుంది.

Read Also :  IPL 2022 : లక్నో సూపర్‌ జెయింట్స్‌ జెర్సీ లీక్.. గుజరాత్ టైటాన్స్ జెర్సీ లాంచ్ ఎక్కడంటే?